శా:- అంతర్జాలమునందు సత్ కవులు తామంతా ప్రయత్నంబుతో యెంతో కొంత సమస్య పూరణల తో యింపైన సద్వర్ణనల్ భ్రాంతిన్ వ్రాయుచు పాల్గొనన్, కరుణతో పాండిత్య సద్భూషణుల్ సాంతంబున్ తమ కండనుండి నడుపున్. సఖ్యత్వ మొప్పారగన్.
చ:- చదువరి లేక పద్యములు చాలగ నెట్టు రచింపనౌను? యా చదువరి కూడ సభ్యుడయ. చక్కగ ముందు పఠింప గల్గినన్ పిదప ననేక పద్యములు ప్రీతిగ వ్రాయగ సాధ్యమౌను. మీ మదిని సుధాబ్ధి గల్గు నది మేదినిపై ప్రకటింప సాద్యమౌన్.
రండీ. చూడండి. మీ భావనలను ఛందో బద్ధంగా మీరే వద్దన్నా పంచగలుగుతారు. ఇది నిజం. నాలాగే మీరూనూ. ధన్యవాదములు. భవదీయుడు చింతా రామ కృష్ణా రావు.
ఆచార్యా, ఒత్తిడి జీవితపు ఎడారిలో డస్సిపోయే మాబోంట్లకు మీ ఆంధ్రామృతాస్వాదన నూతనోత్సాహం నింపే ఓ ఒయాసిస్సు. భువనవిజయం అని వినటమే కాని ఎప్పుడూ వీక్షించే అవకాశం కలుగలేదు. మీ వలన ఈ రోజు ఆ అదృష్టం కలుగుతోంది. అష్టదిగ్గజాలు కవితాపాఠం చేసే రాయలవారి సభ భువనవిజయమని తెలుసు. ఇప్పుడు దాన్ని ఎలా నిర్వహిస్తారో, దాని స్వరూప స్వభావాలు ఏమిటో తెలుపగలరు.
6 comments:
మీ ఆహ్వాన పత్రిక చాలా బాగుంది. ఇది పద్యాలల్లేవారికేనా లేక చదివేవారికికూడానా?
క:-
రామన్న! ఊరుకోమయ!
రామన్నను మీరు సభకు. రంజిలఁ జేయన్.
ప్రేమామృతమును పంచగ
రామన్నయె వచ్చు నచట రక్షణఁ గొలుపన్
క:-
ఆకాశ మంత ఎత్తగు
ఆకాశపు రామ భావనాకాశమునన్
లోకేశుడు ప్రశ్నించెను.
మీకును అవకాశముండు. మేలును కూర్పన్.
చ:-
చదువరి లేక పద్యములు చాలగ నెట్టు రచింపనౌను? యా
చదువరి కూడ సభ్యుడయ. చక్కగ ముందు పఠింప గల్గినన్
పిదప ననేక పద్యములు ప్రీతిగ వ్రాయగ సాధ్యమౌను. మీ
మదిని సుధాబ్ధి గల్గు నది మేదినిపై ప్రకటింప సాద్యమౌన్.
రండీ. చూడండి. మీ భావనలను ఛందో బద్ధంగా మీరే వద్దన్నా పంచగలుగుతారు. ఇది నిజం. నాలాగే మీరూనూ.
ధన్యవాదములు.
భవదీయుడు
చింతా రామ కృష్ణా రావు.
ఆచార్యా, ఒత్తిడి జీవితపు ఎడారిలో డస్సిపోయే మాబోంట్లకు మీ ఆంధ్రామృతాస్వాదన నూతనోత్సాహం నింపే ఓ ఒయాసిస్సు. భువనవిజయం అని వినటమే కాని ఎప్పుడూ వీక్షించే అవకాశం కలుగలేదు. మీ వలన ఈ రోజు ఆ అదృష్టం కలుగుతోంది. అష్టదిగ్గజాలు కవితాపాఠం చేసే రాయలవారి సభ భువనవిజయమని తెలుసు. ఇప్పుడు దాన్ని ఎలా నిర్వహిస్తారో, దాని స్వరూప స్వభావాలు ఏమిటో తెలుపగలరు.
శ్రీ ఫణి ప్రసన్న కుమారా!
ఉ:-
ఇంటనె యుండి మీర లట యింటరు నెట్టును కల్గి యున్నచో
కంటికి యింపుగా కవిత కాంతులు జిమ్మెడి బ్లాగునందు మీ
వంటి గుణోద్ధతుల్ పరమ భక్తి ప్రపత్తులతోడ నీ క్రియన్
మింటను చేయుటన్ గనుచు మేలని మీరలె చెప్పనౌనయా!
సీ:-
జ్ఞాన మంతర్జాల కాంతులు విరజిమ్మ
భువన విజయ మలరు వసుమతిని!
కృష్ణ రాయలనాటి తృష్ణను కలిగిన
కవివతంసులు నేడు కలరు భువిని.
రాజులెన్నగ లేరు. రోజులు మారెను
ఇంటరు నెట్టులే యిచటి సభలు.
నిర్వహించెడి వారు సర్వోత్తములు రాయ
లుగను నిలుచు, కవులుగను మనము.
గీ:-
ప్రశ్న పత్రంబు ముందుగా ప్రకటితమగు.
పద్య రచనలు ముందుగా పంపుచుంద్రు.
తప్పు లుండిన నందరు నొప్పుఁ జెప్పు.
కడమ నొకనాడు నెట్టులో కలియుదురయ.
గీ:-
అట్టి దానిని తదుపరి నెట్టులోన
తెలుగు బ్లాగులలో చేర్చి తెలియఁ జూపు.
చదువు వారికి యలనాటి చక్కనైన
భువనవిజయము కన్పించు. భివిని నేడు.
ఇదీ దీని సంగతి. కొత్త పాళీని కలవ గలిగితే క్రొంగ్రొత్త విషయాలు తెలుస్తాయి.
ధన్యవాదములు,
గీ.
భువన విజయము అరుదెంచె బాగు బాగు
అతిథు లందరు విచ్చేసి రాయ వలెను
మధుర మైనట్టి కవితలు పద్యములను
తేనె లొలికించు రుచులతో తీయ గాను
బ్లాగర్ Hari Dornala అన్నారు...
గీ.
భువన విజయము అరుదెంచె బాగు బాగు
అతిథు లందరు విచ్చేసి రాయ వలెను
మధుర మైనట్టి కవితలు పద్యములను
తేనె లొలికించు రుచులతో తీయ గాను
హరిగారూ! అలవోకగా తేటగీతి వ్రాస్తున్నందుకు అభినందనలు.
1 - 2 - 3 పాదాలలో యతులు సరిచూడవలసివున్నది.
ఇలా మార్చినచో సరిపోతుంది.
గీ:-
భువన విజయము అరుదెంచె భువికి, నేడు
అతిథు లరుదెంచి కవితల నల్లవలెను.
మధురమైనట్టి కవితలు మదుల సోక
తేనె లొలికించు రుచులతో తీయగాను.
ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.