గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, అక్టోబర్ 2008, గురువారం

" ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ పూర్వ జన్మ తపః ఫలం "

" ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ పూర్వ జన్మ తపః ఫలం "
ఈ మాటలెంత యదార్థము! ఆంధ్రుడై పుట్టిన ప్రతీ వానికీ జన్మతః ప్రాప్తించే వారసత్వ సంపద " అమృతోపమానమైన ఆంధ్ర వాఙ్మయము".
సీ:-అమృతోపమానమై యలరారు చున్నట్టి - యసదృశ భాష యీ యాంధ్ర భాష.
అనితర సాధ్యమౌ సునిశిత పదయుక్తి - నద్భుత భాష యీ యాంధ్ర భాష.
అమర భాషకు లేని యవాధాన ప్రక్రియ - నలరార దొడగెనీ యాంధ్ర భాష.
ఆంధ్ర కావ్యామృత మందించె కవివరుల్ - హాయి గొల్పెడు దాన నాంధ్రభాష.
గీ:-చదువ నెంచిన యాంధ్రమ్మె చదివి చూడు
డెంద మానంద సందోహ మందు నిజము.
సుందరమ్మైన భావాల సొగసు జూడ
యాంధ్ర భాషకు మించెడి దవని గలదె?
ఔనో కాదో మీరూ ఆలోచించండి. Print this post

2 comments:

పుల్లాయన చెప్పారు...

నేనైతే నూటికి వెయ్యి శాతం ఏకీభవిస్తాను మీతో ఈ విషయం లో

పుల్లాయన చెప్పారు...

మీతో పూర్తిగా ఏకీభవిస్తాను ఈ విషయం లో

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.