గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, అక్టోబర్ 2008, బుధవారం

నక్క నాగ లోకము ..... కాదు కాదు నాక లోకము.

మనం సాధారణంగా వింటుంటాం. నక్క ఎక్కడ... నాగలోక మెక్కడ. ... అని. . మనకనిపిస్తుంది నక్కకి, నాగ లోకానికి, సంబంధమేమిటని.
మనం జాగ్రత్తగా పరిశీలిస్తే నాగ లోకం కాదు. నాకలోకం. అన్న విషయం తెలుస్తుంది.
మనం నక్క ఎక్కడ....నాకలోకమెక్కడ. అని అంటే విన్నవారు మనమే తప్పు చెప్పుతున్నామని అనుకొంటారు కూడాను. ఐతే అర్థం తెలిస్తే అలాగనకపోవచ్చుననుకొంటాను. ఇప్పుడర్థాన్ని పరిశీలిద్దామా?

కం = సుఖము.
న + కం = అకం = సుఖము కానిది = దుఃఖము.
న + అ కం = నాకం = దుఃఖమన్నదే లేనిది.
నాక = దుఃఖమన్నదే లేని
నాక లోకము = దుఃఖమన్నదే లేని లోకము అని అర్థము.
దుఃఖమన్నదే లేని లోకము స్వర్గ లోకము.
జుత్తులమారి నక్క ఎక్కడ, స్వర్గ లోక మెక్కడ. అని అర్థము.
ఇంతుందండీ యీ కథ.
మరొక మారు సమయం చిక్కి నప్పుడుమరొక విషయాన్ని గూర్చి పరిశీలిద్దాం.
జైహింద్. Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తమ్ముడు చాలా బాగుంది ఈ వ్యాఖ్య " నక్కకీ -నాగలోకానికి " గల తేడా . ఐతె ఇది నేను " చింతా వారి పేరున " ఆంధ్రాఫొక్స్.నెట్ " ఉంచాను " [ వితౌట్ పెర్మిషన్ ] కోప్పడవు కదూ ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.