గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జనవరి 2025, శనివారం

యథాఽస్త్రరహితే పుంసి. ... మేలిమిబంగారం మన సంస్కృతి

 జైశ్రీరామ్.

శ్లో.  యథాఽస్త్రరహితే పుంసి  - వృథా శౌర్యపరిగ్రహః ౹

తథోపన్యాస హీనస్య  - వృథా శాస్ట్రపరిగ్రహః ౹౹

తే.గీ.  అస్త్ర హీనుని శౌర్యంబు వ్యర్థమేను, 

శాస్త్ర విజ్ఞాన మున్నను సభలలోన

పలుకుటయె చేతకానట్టి పండితునకు

వ్యర్థమేకద, విద్యనిరర్ధకమగు.       

భావము.  అస్త్రాలు లేనివానికి శౌర్యము ఉన్నను వ్యర్థమే. అలాగే 

ఉపన్యాసము చేసే సామర్థ్యం లేనివారికి శాస్త్ర జ్ఞానము ఉన్నను వ్యర్థమే అగును.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.