జైశ్రీరామ్.
శ్లో. జపహోమార్చనం కుర్యా - త్సు ధౌతచరణః శుచిః|
పాదశౌచవిహీనం హి - ప్రవివేశ నలం కలిః ||
తే.గీ. జపము హోమార్చనల్ చేయు సమయమునకు
ముందు కాళ్ళు కడుగుకొని పొలయుటొప్పు,
పాదశౌచవిహీనుని వదలఁబోక
కలి ప్రవేశించి కష్టముల్ కలుఁగఁ జేయు.
భావము. జపాలు, హోమాలు, అర్చనలు, పూజాది క్రతువులు ఆచరించే ముందు
శుభ్రముగా కాళ్ళు కడుక్కుని ప్రారంభించాలి. ఎవరైతే పాదాలు కడగకుండా
దైవ కార్యాలు చేసినా, మల మూత్ర విసర్జన తరువాత, భోజనం తరువాత,
బయట నుండి వచ్చిన తరువాత కాళ్ళు కడగరో ఆ కడగని పాదాల ద్వారా
కలి పురుషుడు ఇంట్లోకి ప్రవేశించి దరిద్రాలను, రోగాలను,
కలహాలను ప్రసాదిస్తాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.