జైశ్రీరామ్.
శ్లో. మిత్రే నివేదితే దుఃఖే - దుఃఖినో జాయతే లఘు
భారం భారవహస్యేన - స్కంధయో: పరివర్తతే.
తే.గీ. దుఃఖమును మిత్రునకుఁ జెప్ప దుఃఖమణఁగు,
దుఃఖితునిమది తేలికౌన్ దోయజాక్ష!
భుజములనుమార్చి బరువును మోయుచున్న
భారమనిపించదది తగ్గి, భక్తవరద!
భావము. భుజము మీద బరువుమోసేవాడు ఆ బరువునును రెండుభుజాల
మధ్యకు మార్చుకుంటే భారము తగ్గినట్లుగా, మంచిమిత్రునికి బాధ చెప్పుకుంటే
బాధపడేవాని దుఃఖము తగ్గి మనసు తేలికపడుతుంది. అంటే మన దుఃఖము
మన ఆత్మీయయులతో పంచుకుంటే కొంత ఉపశమనము కలుగునని భావము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.