జైశ్రీరామ్.
రచయిత. శ్రీ కోడూరి శేషఫణి శర్మ
సీ||
పదునారు వయసులో పెదవిపై మృదువుగా
మొలకెత్తు మీసమ్ము మురిపెమౌను!
చురకత్తివలె దోచి కరవాలముగ సాగి
మగవాని మగటిమి జగతి జాటు!
కోరమీసము దువ్వ,కొంటెగా కనుగీట
ముదిత మురిసి మ్రోల మోకరిలును!
చివరలు మెలి ద్రిప్ప చెలియల మనములన్
చిలిపి యూహలనెన్నొ కలుగజేయు!
చెవిలోన గుసగుసల్ చెలికి జెప్పెడు వేళ
గిలిగింతతో నిడు పులకరింత!
అతివ యధరమంది యమృతమ్ము గ్రోలుచో
మధుర మిబ్బడి యౌను మగువలకును!
తరుణి తనువు పైన తారాడు మీసాలు
రసతంత్రులను మీటి రగులజేయు!
శృంగారసమయాన చిరుచెమటలు గ్రమ్మ
మీసమున్ బొగడుగా మెలత కరగి!
తే.గీ||
మగని మీసము మగువకు బిగువు నిడగ,
చెలుని శ్మశ్రువు చెలియకు చెలువమొసగ,
తరుణి తనియించు,మీసమున్ తడిమి తనియు,
మీసమున్నట్టి మగవాడె మేటి యనుచు!
కోడూరి శేషఫణి శర్మ
తే. 24 - 01 - 2025.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.