గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జూన్ 2018, బుధవారం

అనులోమ,విలోమ"-నయ"-వృత్తము.బృహతీఛందము.న.న.న.గణములు.ప్రాసనీమముగలదు. రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
అనులోమ,విలోమ"-నయ"-వృత్తము.బృహతీఛందము.న.న.న.గణములు.ప్రాసనీమముగలదు.
రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                        జుత్తాడ.

      అనులోమ"-నయ"-వృత్తము.
తిను,విను,జనుమ తమి 
మను మతినుత మతిగ
మనుజత భువి గతిగ
మనుగ తగుత గతిమ!
భావము:-భగవంతుడు యిచ్చినది తినుము.పెద్దల మాటలు విను.జీవనాశ
గలిగి వర్తిలుమ.మిక్కిలి కొనియాడ బడువానిగ జీవించుము.మానవత్వమే
ఈ భూతలమందుమోక్షముగదా.గతినిపొందుటకు తగు విధముగ మన్నుమ!

విలోమ"-నయ"-వృత్తము.
మితమును జను వినుతి
గతి మత నుతి మనుమ
గతిగ  విభుత  జనుమ
మతిగ తగుత గనుమ!
భావము;-పలువురు కొనియాడు నటుల మితముగ జీవించుము.నుతి మతమైన,విధముగ మనుము.వైభవోపేతమైన మోక్ష మార్గమున చరించుమ.మంచి బుద్ధి తత్వమునకు తగినట్లుగా కనిపించుమా!

ఇట్లు,
తమ విశ్వసనీయుడు,
మూర్తి. జుత్తాడ
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.