గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జూన్ 2018, మంగళవారం

రసయాద్వయ,ముకుంద,ధృతిరసయాద్వయ,నిల్చునీతి,రాగత,కీర్తిలు, కర్మజీవనా,గర్భ"-రసయాశ్రయ"-ద్వయ వృత్తములు. రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.
రసయాద్వయ,ముకుంద,ధృతిరసయాద్వయ,నిల్చునీతి,రాగత,కీర్తిలు, కర్మజీవనా,గర్భ"-రసయాశ్రయ"-ద్వయ వృత్తములు.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                    జుత్తాడ.

"- రసయాశ్రయ"-ద్వయవృత్తములు.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.స.య.ర.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
1.కానకేగిన కాచు ధర్మం?కల్మి నిల్చునె?జీవితాంతం!కర్మతం జన్మ మేర్పడున్?
 ప్రాణఘాతుక చర్య దోషం?బల్మి నుల్మకు ప్రాణ స్నేహం?పర్మ తత్వంబు మేలునౌ?                                           కాననౌనొకొ?రాగతంబుల్?కల్మషాత్మను!మార్చు కొమ్మా!   కర్మసాక్ష్యాన నిల్వుమా!                                       నేను,నాదను స్వార్ధమేలం?నిల్ము నీతిగ జ్ఞానివౌచుం?నిర్మలాత్మాను వర్తివై?

2.
కల్మి నిల్చునె?జీవితాంతం!కాన కేగిన కాచు ధర్మం!కర్మతం జన్మ మేర్పడున్?
బల్మి నుల్మకు ప్రాణ స్నేహం?ప్రాణఘాతుక చర్య దోషం?పర్మ తత్వంబు మేలునౌ?                                           కల్మషాత్మను మార్చు కొమ్మా!కాన నౌనొకొ?రాగతంబుల్?కర్మ సాక్ష్యాన నిల్వుమా! 
నిల్ము నీతిగ జ్ఞానివౌచుం?నేను,నాదను స్వార్ధ మేలం?నిర్మలాత్మాను వర్తివై?

1.గర్భగత"-రసయా"-ద్వయ వృత్తములు.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.91.ప్రాసగలదు.
1.కాన కేగిన కాచు ధర్మం ?                     2.కల్మి నిల్చునె?జీవితాంతం?
ప్రాణఘాతుక చర్య దోషం?                       బల్మి నుల్మకు ప్రాణ స్నేహం?
కాననౌనొకొ?రాగతంబుల్?                        కల్మషాత్మను మార్చుకొమ్మా!
నేను,నాదనుస్వార్ధ మేలం?                        నిల్ము నీతిగ జ్ఞాని వౌచుం?

2.గర్భగత"-ముకుంద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.ర.లగ.గణములు.వృ.సం.83.ప్రాసనీమముగలదు.
కర్మతం జన్మ మేర్పడున్?
పర్మ తత్వంబు మేలునౌ?
కర్మ సాక్ష్యాన నిల్వుమా?
నిర్మలాత్మాను వర్తివై?

3.గర్భగత"-ధృతిరసయా"-ద్వయ వృత్తములు.ధధృతిఛందము.ర.సయ.ర.స.య.గణములు.
యతి.10,వ.యక్షరము.ప్రాసనీమముగలదు.

1.కానకేగిన కాచు ధర్మం?కల్మి నిల్చునె?జీవితాంతం?
  ప్రాణఘాతుక చర్య దోషం?బల్మి నుల్మకు ప్రాణ స్నేహం?
కాననౌనొకొ?రాగతంబుల్?కల్మషాత్మను మార్చు కొమ్మా?
నేను,నాదను స్వార్ధమేలం?నిల్ము నీతిగ జ్ఞాని వౌచున్?

2.కల్మి నిల్చునె?జీవితాంతం?కానకేగిన కాచు ధర్మం?
బల్మి నుల్మకు ప్రాణ స్నేహం?ప్రాణ ఘాతుక చర్య దోషం?
కల్మషాత్మను మార్చు కొమ్మా!కాన నౌనొకొ?రాగతంబులు!
నిల్ము నీతిగ జ్ఞాని వౌచుం?నేను,నాదను స్వార్ధ మేలన్?

4.గర్భగత"-నిల్చునీతి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.ర.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కల్మినిల్చునె?జీవితాంతం? కర్మతం  జన్మ మేర్పడున్?
బల్మి నుల్మకు ప్రాణస్నేహం?పర్మ తత్వంబు మేలునౌ?
కల్మషాత్మను మార్చుకొమ్మా?కర్మ సాక్ష్యాన నిల్వుమా?
నిల్ము నీతిగ జ్ఞాని వౌచుం?నిర్మలా త్మాను వర్తివై?

5.గర్భగత"-రాగత"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.ర.య.జ.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కల్మి నిల్చునె?జీవితాంతం?కర్మతం జన్మ మేర్పడుం?కానకేగిన కాచు ధర్మం?
బల్మి నుల్మకు ప్రాణస్నేహం?పర్మ తత్వంబు మేలునౌ?ప్రాణఘాతుక చర్య దోషం?       
కల్మషాత్మను మార్చుకొమ్మా?కర్మ సాక్ష్యాన నిల్వుమా?కాననౌనొకొ?  రాగతంబుల్?
నిల్ము నీతిగ జ్ఞాని వౌచుం?నిర్మలా త్మాను వర్తివై?నేను,నాదను స్వార్ధమేలం?

6.గర్భగత"కీర్తిలు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.ర.య.జ.జ.గగ.గములుయతితి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కర్మతం జన్మ మేర్పడుం?కానకేగిన కాచు ధర్మం?
పర్మ తత్వంబు మేలునౌ?ప్రాణ ఘాతుక చర్య దోషం?
కర్మ సాక్ష్యాన నిల్వుమా? కాననౌనొకొ?రాగతంబుల్?
నిర్మలాత్మాను వర్తివై?నేను,నాదను స్వార్ధ మేలం?

7.గర్భగత"-కర్మ జీవనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.ర.య.జ.జ.య.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కర్మతం జన్మ మేర్పడుం?కానకేగిన కాచు ధర్మం?కల్మి నిల్చునె?జీవితాంతం?
పర్మ తత్వంబు మేలునౌ?ప్రాణఘాతుక చర్య దోషం?బల్మి నుల్మకు ప్రాణ స్నేహం?
కర్మ సాక్ష్యాన నిల్వుమా?కాననౌనొకొ?రాగతంబుల్?కల్మషాత్మను మార్చు కొమ్మా?
నిర్మలాత్మాను వర్తివై?నేను,నాదను స్వార్ధ మేలం?నిల్ము నీతిగ జ్ఞానివౌచున్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.