గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జూన్ 2018, ఆదివారం

భయానక,నియతీ,నిరుపమ,భయాననయా,చెలంగు,అశాశ్వతా,వనజా,మిధ్యా,తలపగ,ఆశాశ్రీ,గర్భ"-నాస్తీతీతి"-వృత్తము. రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.

భయానక,నియతీ,నిరుపమ,భయాననయా,చెలంగు,అశాశ్వతా,వనజా,

మిధ్యా,తలపగ,ఆశాశ్రీ,గర్భ"-నాస్తీతీతి"-వృత్తము. రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
శ్లో: మాతా నాస్తి!పితా నాస్తి! నాస్తి బంధుస్సహోదరః!
     అర్ధం నాస్తి!గృహం నాస్తి!తస్మాత్జా గ్రతౌ గ్రతః!
అనే శ్లోకాన్ని  ఆధారముగా గొని,నాస్తీతి వృత్తము వ్రాయడమైనది.

"-నాస్తీతి"వృత్తము.
ఉత్కృతిఛందము.భ.య.న.న.య.త.స.య.లల.గణములు.10,18.
ప్రాసనీమముగలదు.
తల్లెవరు?తండ్రెవరిల?తలపగ నంతా మిధ్యే?తను వశాశ్వతంబు గద?
వల్లని సిరేల?పుడమి?పలుకగ!రాదే?వెంటం?వనజు డేమి?వ్రాసెనొకొ?
చెల్లెవరు?చుట్ట మెవరు?చెలగరె?యాశాశ్రీలం!చినికినం?దరింజనరు!
కల్ల వసితంబు,గృహిణి!కల గదె? జీవం బెంచం!కనగ నౌనె?యాగతము!

యాశాశ్రీలం=ధనమందాశలతో,చినికినం=వర్షముపడిన,వసితంబు=
నివాసము(గృహము),గృహిణి=ఇల్లాలు,కల గదె=కలయేసుమా,
జీవము=ప్రాణము,జీవితము,కనగ నౌనె?=చూడగ వీలుపడునె,
చెలగరె=విజృంభించరె?యాగతము=రాబోవునది.
1.గర్భగత"-భయానక"-వృత్తము.
బృహతీఛందముృభ.య.న.గణములు.వృ.సం.463.ప్రాసగలదు.
తల్లెవరు?తండ్రెవరిల?
వల్లని సిరేల?పుడమి!
చెల్లెవరు?చుట్ట మెవరు?
కల్ల వసితంబు గృహిణి!

2.గర్భగత"-నియతీ"-వృత్తము.
అనుష్టునియతీన.య.గగ.గణములు.వృ.సం.16.ప్రాసగలదు.
తలపగ నంతా  మిధ్యే?
చెలగరె?యాశా శ్రీలన్?
పలుకగ రాదే!వెంటన్?
కలగదె?జీవంబెంచన్?

3.గర్భగత"-నిరుపమ"-వృత్తము.
బృహతీఛందము.న.ర.న.గణములు.వృ.సం.472ప్రాసగలదదు.
తను వశాశ్వతంబు! గద?
చినికినం?దరింజనరు?
వనజు డేమి?వ్రాసెనొకొ?
కనగ నౌనె?యాగతము?

4.గర్భగత"-భయా ననయా"-వృత్తము
అత్యష్టీఛందము.భ.య.న.న.య.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తల్లెవరు?తండ్రెవరిల?తలపగ నంతా మిధ్యే!
చెల్లెవరు?చుట్ట మెవరు?చెలగరె?యాశా శ్రీలన్?
వల్లని సిరేల?పుడమిం! పలుకగ రాదే వెంటన్?
కల్ల వశితంబు గృ హిణి! కల గదె?జీవం బెంచన్?

5.గర్భగత"-చెలంగు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.య.త.స.జ.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తలపగ నంతా మిధ్యే?తను వశాశ్వతంబు గద?
చెలగరె యాశా శ్రీలం?చినికినం దరిం జనరు?
పలుకగ రాదే వెంటం?వనజు డేమి వ్రాసె నొకొ?
కల, గదె?జీవంబెంచం?కనగ నౌనె? యాగతము?

6.గర్భగత"-అశాశ్వతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.య.త.స.జ.స.న.భ.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
తలపగ నంతా మిధ్యే?తనువశాశ్వతంబు గద?తల్లెవరు?తండ్రెవరిల?
చెలగరె!యాశా శ్రీలం?చినికినం దరిం జనరు?చెల్లెవరు?చుట్ట మెవరు?
పలుకగ రాదే వెంటం?వనజుడేమి ?వ్రాసెనొ?వల్లని?సిరేల?పుడమిన్?
కల గదె?జీవంబెంచం?కనగ నౌనె?యాగతము?కల్ల,వశితంబు!గృహిణి?

7.గర్భగత"-వనజా"-వృత్తము.
ధృతిఛందము.న.ర.న.భ.య.న.గణములు.యయి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తనువశాశ్వతంబు గద?తల్లెవరు?తండ్రెవ రిల?
చినికినం?దరిం జనరు!చెల్లెవరు?చుట్ట మెవరు?
వనజు డేమి?వ్రాసెనొ?వల్లని సిరేల?పుడమిన్?
కనగ నౌనె?యాగతము?కల్ల,వశితంబు!గృహిణి?

8.గర్భగత"-మిధ్యా"వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.న.భ.య.న.న.య.గగ.గణములు.యతులు.10.19.
ప్రాసనీమముగలదు.
తను వశాశ్వతంబు గద?తల్లెవరు?తండ్రెవరిల?తలపగ!నంతా మిధ్యే?
చినికినం?దరిం జనరు!చెల్లెవరు?చుట్టమెవరు?చెలగరె!యాశా శ్రీలన్?
వనజు డేమి?వ్రాసెనొ?వల్లని సిరేల?పుడమిం?పలుకగ రాదే?వెంటన్?
కనగ నౌనె?యాగతము?కల్ల,వశితంబు!గృహిణి?కల గదె?జీవంబెంచన్?

9.గర్భగత"-తలపగ"-వృత్తము.
అత్యష్టీవృత్తము.న.య.మ.న.భ.లల.గణములుయతతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తలపగ నంతా మిధ్యే?తల్లెవరు?తండ్రెవరిల?
చెలగరె!యాశా శ్రీలం?చెల్లెవరు?చుట్ట మెవరు?
పలుకగ రాదే? వెంటం?వల్లని సిరేల? పుడమిన్?
కల గదె?జీవం బెంచం?కల్ల,వశితంబు? గృహిణి?


10.గర్భగత"-ఆశాశ్రీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.య.మ.న.భ.న.స.జ.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
తలపగ నంతా మిధ్యే?తల్లెవరు?తండ్రెవరిల?తనువశాశ్వతంబు గద?
చెలగరె?యాశాశ్రీలం?చెల్లె వరు?చుట్టమెవరిల?చినికినం దరింజనరు!
పలుకగ రాదే!వెంటం?వల్లని సిరేల?పుడమిం?వనజుడేమి వ్రాసెనొ?
కల గదె?జీవంబెంచం?కల్ల వశితంబు?గృహిణి?కనగనౌనె?యాగతము!
స్వస్తి.
మూర్తి.. 
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.