జైశ్రీరామ్.
అసతోమా,పోరేల,విశ్వసౌ ఖ్య,భద్రాత్మనా,చివురిం చు,కృతికీర్తి,చవులూరు ,
వాగ్ఝరీ,బుధానంద,శోభిలు,గర్భ"-
రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
చిదానంద"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.స.స.మ.త.భ.య.స. లగ.గణములు.
యతులు.10,18.ప్రాసనీమముగలదు.
సుధామాధురి వాగ్ఝరులం?శోభిల్లం జిహ్వాగ్రమందు!శివమై వాక్సతి నిల్వుమా?
చిదానందము నంద!ననుం?శ్రీభద్రాత్మ్యతం బేర్చుతల్లి?చివురింపం కృతి కీర్తులున్?
బుధానందము నొంద మదిం?భూభాగ్యోద్వర్ఛస్సు నింపు?భువనైకాత్మ వచోర్విణీ!
సదా గావగ రమ్ము ప్రభం?సౌభద్రాశ్రీ శోభితాంఘ్రి?చవులూరింపగ జేయుమా!
1.గర్భగత"-అసతోమా"-వృత్తము.
బృహతీఛందము.య.స.స.గణములు.వృ.సం. 218.ప్రాసగలదు.
సుధా మాధురిం వాగ్ఝరులన్?
చిదానందము నంద ననున్?
బుధానందము నొంద మదిన్?
సదా గావ రమ్ము ప్రభన్?
2.గర్భగత"-పోరేల?"-వృత్తము.
అనుష్టుప్ఛందము.మ.త.గల.గణములు. వృ.సం.161.ప్రాసగలదు.
శోభిల్లం జిహ్వాగ్ర మందు!
శ్రీ భద్రాత్మ్యం బేర్చు తల్లి?
భూభాగ్యోద్వర్ఛస్సు నింపు?
సౌభద్రాశ్రీ శోభితాంఘ్రి?
3.గర్భగత"-విశ్వసౌఖ్య"-వృత్తము.
బృహతీఛందము.స.భ.ర.గణములు.వృ.సం. 181.ప్రాసగలదు.
శివమై వాక్సతి నిల్వుమా?
చివురింపం కృతి కీర్తులున్?
భువనైకాత్మ వచోర్విణీ!
చవు లూరింపగ జేయుమా!
4.గర్భగత"-భద్రాత్మనా"-వృత్తము.
అత్యష్టీఛందము.య.స.స.మ.త.గల. గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సుధా మాధురి వాగ్ఝరులం?శోభిల్లం జిహ్వాగ్రమందు!
చిదానందము నంద ననుం?శ్రీభద్రాత్మ్యం బేర్చుతల్లి?
బుధానందము నొంద మదిం?భూభాగ్యోద్వర్ఛస్సు!నింపు?
సదా గావగ రమ్ము ప్రభం!సౌ భద్రా శ్రీ ! శోభితాంఘ్రి?
5.గర్భఖత"-చివురించు"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.త.భ.య.స.లగ. గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శోభిల్లం జిహ్వాగ్ర మందు! శివమై వాక్సతి నిల్వుమా?
శ్రీభద్రా త్మ్యంబేర్చు తల్లి?చివురింపం కృతి కీర్తులున్?
భూ!భాగ్యోద్వర్ఛస్సు నింపు?భువనైకాత్మ వచోర్విణీ!
సౌభద్రా శ్రీ శోభితాంఘ్రి?చవు లూరింపగ జేయుమా!
6.గర్భగత"-కృతికీర్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.త.భ.య.స.జ.భ.జ. లగ.గణములు.
యతులు.9,18.ప్రాసనీమముగలదు.
శోభిల్లం జిహ్వాగ్రమందు!శివమై వాక్సతి నిల్వుమా?సుధా మాధురి వాగ్ఝరులన్?
శ్రీభద్రాత్మ్యంబేర్చు తల్లి?చివురింపం కృతికీర్తులుం?చిదానందము నంద ననున్?
భూభాగ్యోద్వర్ఛస్సు నింపు?భువనైకాత్మ వచోర్విణీ!బుధానందము నొంద మదిన్?
సౌభద్రా శ్రీశోభితాంఘ్రి?చవులూరింపగ జేయుమా!సదా గావగ రమ్ము ప్రభన్?
7.గర్భగత"-చవులూరు"-వృత్తము.
ధృతిఛందము.స.భ.ర.య.స.స.గణములు. యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శివమై వాక్సతి నిల్వుమా?సుధా మాధురి వాగ్ఝరులన్?
చివురింపం కృతి కీర్తులుం?చిదా నందము నంద ననున్?
భువనైకాత్మ వచోర్విణీ! బుధానందము నొంద మదిన్?
చవులూరింపగ జేయుమా!సదా గావగ రమ్ము ప్రభన్?
8.గర్భగత"-వాగ్ఝరీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.భ.ర.య.స.స.మ.త. గల.గణములు.
యతులు.10,19.ప్రాసనీమముగలదు.
శివమై వాక్సతి నిల్వుమా?సుధా మాధురి వాగ్ఝరులం?శోభిల్లం జిహ్వాగ్ర మందు!
చివురింపం కృతి కీర్తులుం!చిదానందము నంద ననుం?శ్రీభద్రాత్మ్యంబేర్చు తల్లి?
భువనైకాత్మ వచోర్విణీ!బుధానందము నొంద మదిం?భూభాగ్యోద్వర్ఛస్సు నింపు?
చవులూరింపగ జేయుమా!సదా గావగ రమ్ము ప్రభం?సౌభద్రా శ్రీ శోభితాంఘ్రి?
9.గర్భగత"-బుధానంద"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.త.భ.త.జ.లగ. గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శోభిల్లం జిహ్వాగ్రమందు!సుధా మాధురి వాగ్ఝరులం?
శ్రీభద్రాత్మ్యంబేర్చు తల్లి?చిదానందము నంద ననున్?
భూభాగ్యోద్వర్ఛస్సు నింపు?బుధానందము నొంద మదిన్?
సౌభద్రా శ్రీశోభితాంఘ్రి?సదా గావగ రమ్ము ప్రభన్?
వు
10.గర్భగత"-శోభిలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.త.భ.త.జ.జ.య.స. లగ.గణములు.
యతులు.9,18.ప్రాసనీమముగలదు.
శోభిల్లం జిహ్వాగ్రమందు!సుధి మాధురి వాగ్ఝరులం?శివమై వాక్సతి నిల్వుమా!
శ్రీభద్రాత్మ్యంబేర్చు తల్లి?చిదానందము నంద ననుం?చివురింపం కృతి కీర్తులున్?
భూభాగ్యోద్వర్ఛస్సు నింపు?బుధానందము నొంద మదిం?భువనైకాత్మ వచోర్విణీ!
సౌభద్రా!శ్రీ శోభితాంఘ్రి సదా గావగ రమ్ము ప్రభం?చవులూరింపగ జేయుమా?
స్వస్తి.
మూర్తి.జుత్తా
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.