గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జూన్ 2016, బుధవారం

వ్యసనస్య చ మృతోశ్చ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. వ్యసనస్య చ మృతోశ్చ వ్యసనం కష్టముచ్యతే
వ్యసన్యధోధో వ్రజతి స్వర్యాత్యవసనీ మృతః.
ఆ.వె. వ్యసన మృతులలోన వ్యసనమే కష్టము.
వ్యసన విరహితుండు పడయు దివిని.
వ్యసన పరుఁడు పొందు ననుపమ దుర్గతి
పతనమగుటఁ జేసి పాప గతిని.
భావము. ఎవరైనా వ్యసన మృత్యువు లలో ఏది కష్టము అని అడిగితే, వ్యసనమే కష్టమని చెప్పాలి. స్వర్యాత్ అవ్యసనీ మృతః, అంటే ఏ వ్యసనమూ లేనివాడి మృత్యువు తన సత్కర్మల వలన స్వర్గానికి ఎదిగేలా చేస్తుంది, 
కానీ వ్యసన్యా అధో అధో వ్రజతి అంటే వ్యసనపరుడికి ఒక్కటే మార్గం అధో అధో అంటే కింద కిందకి దిగజారటమే.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.