గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జూన్ 2016, మంగళవారం

దాతవ్యం ఇతి యద్దానం, . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్
శ్లో. దాతవ్యం ఇతి యద్దానం, దీయతేऽనుపకారిణే
దేశే కాలే చ పాత్రే చ, తద్దానం సాత్త్వికం స్మృతం.
క. ఇది యిచ్చుట ధర్మంబని,
మది నుపకృతి చేయనట్టి మహితునికిలలో
ముదమున సమయోచితముగ
వదలక ధర్మంబు చేయ వలయును సుజనుల్.
భావము. "ఇది ఇచ్చుట నా ధర్మము" అని అనుకుని మనకు ఏ ఉపకారమూ చెయ్యని వాడికి, సరైన సమయములో, సందర్భముననుసరించి ఇచ్చే దానమే సాత్త్వికమైన దానము..
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.