30, జూన్ 2016, గురువారం
29, జూన్ 2016, బుధవారం
శ్రీశ్రీశ్రీ గుప్త ప్రసన్న భక్తాంజనేయ స్వామివారి తొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవములు.
0
comments
జైశ్రీరామ్.
ఆర్యులారా! వరంగల్ జిల్లా, రఘునాథపల్లి మండలం, అశ్వారావుపల్లి గ్రామంలో కొలువైయున్న శ్రీశ్రీశ్రీ గుప్త ప్రసన్న భక్తాంజనేయ స్వామివారి తొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత ఘనంగా జరగబోతున్నాయి. మీరంతా అవకాశం కల్పించుకొని స్వామివారి సేవలో పునీత జీవనులై, ఆయురారోగ్య సౌభాగ్య ఆనందాలను శాశ్వితంగా పొందగలరని భావిస్తున్నాను. ఆ స్వామి వారి కరుణ మీపై సదా ప్రసరించును గాక. కార్యక్రమాల వివరాలను చూడండి.
శుభమస్తు.
జైశ్రీగుప్తప్రసన్న భక్తాంజనేయా!
జైశ్రీరామ్.
28, జూన్ 2016, మంగళవారం
27, జూన్ 2016, సోమవారం
26, జూన్ 2016, ఆదివారం
25, జూన్ 2016, శనివారం
24, జూన్ 2016, శుక్రవారం
శ్రీ గుప్త ప్రసన్న భక్త ఆంజనేయ దేవాలయం, అశ్వారావుపల్లి, వరంగల్.
0
comments

23, జూన్ 2016, గురువారం
శ్రీ కొమ్మోజు శ్రీధర్ స్వామివారికి సమర్పించిన పుష్పబంధ చంపక మాలిక
0
comments

22, జూన్ 2016, బుధవారం
వ్యసనస్య చ మృతోశ్చ ... మేలిమి బంగారం మన సంస్కృతి,
0
comments
జైశ్రీరామ్.
శ్లో. వ్యసనస్య చ మృతోశ్చ వ్యసనం కష్టముచ్యతేవ్యసన్యధోధో వ్రజతి స్వర్యాత్యవసనీ మృతః.
ఆ.వె. వ్యసన మృతులలోన వ్యసనమే కష్టము.
వ్యసన విరహితుండు పడయు దివిని.
వ్యసన పరుఁడు పొందు ననుపమ దుర్గతి
పతనమగుటఁ జేసి పాప గతిని.
భావము. ఎవరైనా వ్యసన మృత్యువు లలో ఏది కష్టము అని అడిగితే, వ్యసనమే కష్టమని చెప్పాలి. స్వర్యాత్ అవ్యసనీ మృతః, అంటే ఏ వ్యసనమూ లేనివాడి మృత్యువు తన సత్కర్మల వలన స్వర్గానికి ఎదిగేలా చేస్తుంది,
కానీ వ్యసన్యా అధో అధో వ్రజతి అంటే వ్యసనపరుడికి ఒక్కటే మార్గం అధో అధో అంటే కింద కిందకి దిగజారటమే.
వ్యసన విరహితుండు పడయు దివిని.
వ్యసన పరుఁడు పొందు ననుపమ దుర్గతి
పతనమగుటఁ జేసి పాప గతిని.
భావము. ఎవరైనా వ్యసన మృత్యువు లలో ఏది కష్టము అని అడిగితే, వ్యసనమే కష్టమని చెప్పాలి. స్వర్యాత్ అవ్యసనీ మృతః, అంటే ఏ వ్యసనమూ లేనివాడి మృత్యువు తన సత్కర్మల వలన స్వర్గానికి ఎదిగేలా చేస్తుంది,
కానీ వ్యసన్యా అధో అధో వ్రజతి అంటే వ్యసనపరుడికి ఒక్కటే మార్గం అధో అధో అంటే కింద కిందకి దిగజారటమే.
జైహింద్.

21, జూన్ 2016, మంగళవారం
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య డిగ్రీ మరియు పి.జి.కళాశాల, తిరుపతిలో ఎడ్మిషన్ కొఱకు దరఖాస్తు చేయండి.
0
comments
జైశ్రీరామ్
ఓం నమో శ్రీ వేంకటేశాయ.
ఆర్యులారా! అత్యున్నత సంస్కారాన్నందించడంతో పాటు అత్యంత విలువైన విద్యను కూడా మన పిల్లలకు అందించే అవకాశం ఆ తిరుమలేశుఁడు మనకు కలిగించాడు. తిరుపతి ప్రాచ్య కళాశాలలో విద్యనభ్యసించిన వారు అనేకమంది మహనీయులుగా గౌరవ పురస్కారములందుకొంటున్న విషయం జగద్విదితమే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనగలరు.
జైహింద్.
దాతవ్యం ఇతి యద్దానం, . . . మేలిమి బంగారం మన సంస్కృతి,
0
comments
జైశ్రీరామ్
శ్లో. దాతవ్యం ఇతి యద్దానం, దీయతేऽనుపకారిణే
దేశే కాలే చ పాత్రే చ, తద్దానం సాత్త్వికం స్మృతం.
క. ఇది యిచ్చుట ధర్మంబని,
మది నుపకృతి చేయనట్టి మహితునికిలలో
ముదమున సమయోచితముగ
వదలక ధర్మంబు చేయ వలయును సుజనుల్.
భావము. "ఇది ఇచ్చుట నా ధర్మము" అని అనుకుని మనకు ఏ ఉపకారమూ చెయ్యని వాడికి, సరైన సమయములో, సందర్భముననుసరించి ఇచ్చే దానమే సాత్త్వికమైన దానము..
జైహింద్.

20, జూన్ 2016, సోమవారం
19, జూన్ 2016, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)