గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఏప్రిల్ 2016, మంగళవారం

08-4-2016న నిజాంపేట రామాలయంలో జరిగిన అష్టావధానము. . . అవధాని. శ్రీ ముద్దు రాజయ్య.

జైశ్రీరామ్. 
నిజాంపేట రామాలయంలో జరిగిన 
అష్టావధానము
అవధాని. శ్రీ ముద్దు రాజయ్య.
సమస్య: శ్రీ చింతా రామకృష్ణా రావు.
౧. సమస్య: 
" హర్మ్యమునందు సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో."
పూరణ: 
శర్మదమైనప్రక్రియల చాల తనర్చెడినాటకంబులో
కర్మలు చ్యు పాత్రలుసుఖంబుగ తాము విరామమొందగా
హర్మ్యమునందు సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో
నర్మ వచోభిరాముఁగ గనన్ దనెసోదరియౌ కతంబునన్.

౨. దత్తపది: 
గుడి - బడి - తడి - మడి. పదములు ఉపయోగించి రామాయనాంశము ఐచ్ఛిక ఛందములో.
పూరణ: గుడి వేల్పుల పూజలు రా
బడిరాజరికంబున సుంత భావింపక పు
త్తడిచొక్కపు చారితి యి
మ్మడిముమ్మడి ఖ్యాతి గాంచ మహి రాముండై.

౩. వర్ణన:
శ్రీరామ భావన:
పూరణ:
ఆదర్శ గృహస్థునిగా
సోదరునిగ, సుతుగ, పతిగ, క్షోణింజెలఁగన్
దా దా పుట్టెను రఘుపతి 
మేదుర సాధ్వి గను సీత మేదిని వెలగన్.

౪. నిషిద్ధాక్షరి:
తాటక సంహారము:
దృంచన్ సత్తిన్, వీకన్,
బెంచంధీర్తిన్ మనంగపేళ్ళున్ బీళ్ళున్,
మించం శాంతిని తారా
వించెన్ తాటకను దృంచ విజ్ఞత రామున్.

౫. ఆశువు:
వాతావరణ కాలుష్యము:
బొగ్గుపులుసువాయువుగొని పొలియు పసుపు
నింపి ప్రాణవాయువునిచ్చి నిఖిల జనుల
రక్షనము చేయు యిండ్ల నిర్మానములను
మంచములు చేయుటకుపయోగించఁబడెడు
మూలమగుచుండు వృక్షంబుముఖ్యముగను,
దాని ఘనతను తెల్పగా తరమె నాకు?
౬. అప్రస్తుత ప్రసంగము:
౭. గడులు గణితము.
౮. వార గణనము:
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గురుతుల్యులు అవధాని శ్రీ ముద్దు రాజయ్యగారి అవధానము నందలి " పండితోత్తములు శ్రీ చింతా రామకృష్ణా రావుగారి సమస్య "హర్మ్యము నందు సంచరిలె హాయిగ పార్వతి విష్ణు మూర్తితో " చాలా మనోహరముగా పూరించి నారు. ఇక దత్తపది వర్ణన, నిషిధాక్షరీ మున్నగునవి మరింత అందముగా అలరించు చున్నవి.ఇందు పాల్గొన్న అవధాన స్రష్ట లందరికీ పేరు పేరునా అభినందనలు. మాకందించిన శ్రీ చింతా సోదరులకు కృతజ్ఞతలు

క్షమించాలి 4 రోజులుగా జ్వరం గా ఉన్నందున కంప్యూటర్ ముదుకి రాలేకపోయాను. ఈ రోజు కొంచం నయం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.