గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, ఏప్రిల్ 2016, ఆదివారం

షష్టి పూర్తి వైశిష్ట్యము మరియు నవరత్నమాలిక.

 జైశ్రీరామ్.
శ్రీరస్తు                శుభమస్తు            అవిఘ్నమస్తు.
చి..సౌ.పార్వతీ సమేతుఁడయిన చిబొమ్ములూరి సత్య సుబ్రహ్మణ్య సాంబశివరావుకు
తే.13 - 4 - 2016 న షష్టి పూర్తి సందర్భముగా
అన్నయ్య చింతా రామకృష్ణారావు బహూకరించిన
నవరత్నమాలిక.
శాశ్రీ కణ్వాఖ్య మనోజ్ఞ శాఖ జనిత శ్రీ పార్వతీ సాంబకున్
లోకోద్భాసిత షష్టి పూర్తి విధినాలోకింప విచ్చేయరే.
శ్రీకామ్యార్థము లీయరే. శుభములన్ జేకూర్చురే ప్రేమతో!
శ్రీకారుణ్య రమాధవాశశి ధరాశ్రీవాఙ్మనో నాయకా.

సీశ్రీబొమ్ములూరి సచ్ఛ్రీవంశ రామేశ -  సుబ్బమల ప్రపౌత్ర శుద్ధ చరిత !
పార్వతీశము లసత్ పార్వతీ వర పౌత్ర ! బాబురావ్ నరసాంబ ప్రథమ పుత్ర !
కాణ్వశాఖోద్భవ ! కౌశిక గోత్ర ! సత్ సాంబశివాఖ్యుఁడా ! సరస హృదయ !
కాశ్యప గోత్రజ కామితార్థద కాగషష్టి పూర్తిని వెల్గు సృష్టి లోన.
గీరామ కృష్ణమ్మ లింగమ్మ రమ్య నప్త్రి! !  -   వేంకటేశ్వర రాజమ్మ వినయ పౌత్రి!
రామమూర్తి సువత్సల రమ్య పుత్రి !  -  పార్వతీ ! సాంబశివుతోడ వరలుమమ్మ.

సీషష్టి పూర్తయిన మీ రష్టోత్తర శత వ ర్షములు జీవించుడీ ! ప్రాభవమున.
ముప్పదియారేండ్లు గొప్పగా గడిపిన దంపతులౌ మీరు ధన్యులిలను..
అంజనీ సుకుమారుఁ డపురూప కుసుమ మీ కొసగి రక్షయధృతి నొప్పిదముఁగ.
నుత కార్తికేయ సంస్తుత సింధుజయు మీకు ప్రణవ శ్రీకరునిచ్చి ప్రబలినారు.
గీకొడుకులును కోడళుల్ మిమ్ము కోరి కొలువ మనుమఁడునుమన్మరాలును మరులు గొలుప
సుజన బాంధతతి తోడ శోభిలుడిల రామ కృష్ణుని సత్కృతి రక్ష మీకు.

సీకరుణతో దైవంబు వరలింప మిమ్ముల నాయుసంపదనిచ్చెప్రాయమిచ్చె.
బాల భావన చేసి భక్తిభావనఁ జేసిశక్తి యుక్తులఁ జేసి సాంబశివుఁడ!
ఎమ్దేళ్ళకాపైన నికనాలుగుండొచ్చు ప్రాయంబునను నీకుఁ బన్నిదముగ.
అరువదేండ్లని మీర లరచినన్ వినువారు నమ్ముదురని మీరు నమ్ముటేమి?
గీశాంతి సౌఖ్యాస్పదంబైన శైశవమును బాల్య కౌమార యౌవన భాగ్యములను
మరలపొందుడీ యిక మీరు నిరుపమముగ-  కనుడు జీవన సార్ధక్య గమనసుగతి.

రసరమ్య జీవనోద్గతి నసమానలు మీరుమీ మహాద్భుత గమనం
బసహాయ రమ్యశోభిత మసదృశ మధురాతి మధురమరయఁగనిలపై.

గీమీదు సంతతి మీముందు మేల్తరముఁగ వృద్ధిఁ గాంచుతసత్యసమృద్ధియగుత!
కంటి పాపలై మనుమలు క్రాలుఁగాతబంధు మిత్రులు సంతుష్టినొందు గాత !.

పార్వతీశసాంబవరగుణ నికురుంబ భవ్య భావ కలిత నవ్యతేజ !
దైవచింత కలిగి దర్శించు సత్యమున్ముక్తి మార్గమెన్ను పూజ్యముగను.

సప్తవింశత్యధిక ద్వివిధ కంద గీత గర్భ చంపకమాల.
వర సిరులన్నియున్సరస భావ రసార్ద్రత చక్కనబ్బు భా
స్కరు కరుణన్ సదా కుశల సద్వరమబ్బును కోరినంతవా
గ్వర సరణిన్ సుధా మధుర భాగ్య రమాస్పద మార్గమీరెకాం
తురు ధరణిన్ మహత్ సుఖముతో వరలందగు సుప్రభావభాక్. .

మంగళమౌత పార్వతికి మంగళమౌ నుత సత్తిపండుకున్.
మంగళమౌత సంతతికిమంగళమౌ వర బాంధవాళికిన్.
మంగళమౌత మిత్రులకుమంగళమౌ సభనున్నవారికిన్.
మంగళమౌత శారదకుమంగళమౌమన భారతాంబకున్స్వస్తి.
మంగళమ్.              మహత్.            శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
జైహింద్.
Print this post

2 comments:

సో మా ర్క చెప్పారు...

చాలా బాగున్నది మీ సన్మాన పత్రం.దంపతులకు అభినందనలు.వైశిష్ట్యం నలుగురికీ ఉపయోగపడేలా చేశారు.అభినందన మందారాలు.ధన్యోస్మి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీమాన్ సోమార్కార్యా!
మీ మాన్యోద్భాస వ్యాఖ్య మేలుంగొల్పున్
సామాన్యుండన్ మీరల్
బ్రేమన్ నా కందఁ జేయు విజ్ఞుల్ పృథ్విన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.