జైశ్రీరామ్.
శ్లో. ధన్వంతరి, క్షపణ, కామరసింహ, శంకు, బేతాళభట్టి, ఘటఖర్పర, కాళిదాసాఃఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయం రత్నానివై వరరుచే ర్నవ విక్రమస్య.
గీ. క్షపణకుఁడును, ధన్వంతరి, కాళిదాసు,
శంకు, భేతాళ, ఘటఖర్ప, జన వరరుచి
అమరసింహుఁడుఘన వరాహమిహిరుఁడును
విక్రమార్కుని నవరత్న విశ్వకవులు.
భావము. ధన్వంతరి, క్షపణకుఁడు, అమరసింహుఁడు, శంకువు, బేతాళుభట్టి, ఘటఖర్పరుఁడు, కాళిదాసుఁడు, వరాహమిహిరుఁడు వరరుచి అను కవులు తొమ్మండుగురును విక్రమార్కుని సభయందలి నవరత్నములు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
విక్రమార్కుని ఆస్తానమందలి నవరత్నముల అందరి పేర్లు సరిగా గుర్తులేదు అని అనుకుంటున్న తరుణ మందు చక్కగా వివరించి నందులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.