జైశ్రీరామ్.
శ్లో. అతి పరిచయా దవఙ్ఞా, సంతతగమనా దనాదరో భవతిమలయే భిల్ల పురంధ్రీ , చందనతరుకాష్ఠ మింథనం కురుతే.
గీ. చనువు పెఱుఁగ నలక్ష్యము సంభవించు.
నిరత మేగ ననాదరణీయులవరె?
జీర్ణ గంధపు మ్రానుల చేత వంట
భిల్ల వనితలు చేయరే? విరివి చేసి.
భావము. పరిచయము ఎక్కువయినకొద్దీ అలక్ష్యభావము పెఱుగును. అస్తమాను వస్తూ పోతూ ఉంటే అట్టివారిపై అనాదర భావము పెఱుగును. మలయ పర్వతములపై లభించెడి చందనదారువు మనకెంతో అపురూపమైనది. అట్టి మంచి గంధపు చెట్టు కర్రను అక్కడ నివసించే కోయ స్త్రీ వంట కట్టెలుగా ఉపయోగించుచుండును కదా!
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవును దేనికైనా అతి పనికిరాదు కదా చక్కని శ్లోకాన్ని అందించారు. ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.