గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, సెప్టెంబర్ 2015, మంగళవారం

మన పూర్వీకులు శ్లోకరూపమున చేసిన విద్యుదుత్పత్తి వివరణము.

జైశ్రీరామ్.
విద్యుదుత్పత్తి చేయు విధానము.
శ్లో. సంస్థాప్య మృణ్మయే పాత్రే తామ్రపత్రం సుసంస్మృతమ్!
ఛాదయే ఛ్ఛిఖిగ్రీవేన చార్థ్రాభిః కాష్ఠపాంసుభిః!!
దస్తాలోప్టో నిథాతవ్యః పారదాఛ్ఛాది దస్తతః!
సంయోగా జ్ఞాయతే తేజో మిత్రావరుణ సజ్ఞ్గితమ్!! (అగస్త్య సంహిత)
భావము. ఒక మట్టి కుండను తీసుకొని, దానిలో రాగి పలక పెట్టాలి. తరువాత దానిలో మైలు తుత్తం వేయాలి. తర్వాత మద్యలో తడిసిన ఱంపపు పొట్టువేయాలి. పైన పాదరసము మరియు యశదము (జింక్) వేయాలి తర్వాత తీగలను కలపాలి అప్పుడు దాని నుండి మిత్రావరుణ శక్తి ఉద్భవిస్తుంది
శ్లో. అనేన జలభంగోస్తి ప్రాణోదానేషు వాయుషు!
ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః!!
వాయు బంధక వస్త్రేణ నిబద్దో యానమస్తకే!
ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్!!
భావము. ఒక వంద కుండల యెక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే, నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు, ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది. 
పాఠశాల విద్యార్థులకు ఈ ప్రయోగాలు సుపరిచితమే.
అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.
1. తడిత్ – పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
2. సౌదామిని – రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
3. విద్యుత్ – మేఘముల ద్వారా పుట్టునది.
4. శతకుంభి – వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
5. హృదని – స్టోర్ చేయబడిన విద్యుత్తు.
6. అశని – కర్రల రాపిడి నుండి పుట్టునది.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
జలవిద్యుదుత్పత్తిని గురించి ఆశక్తికరమైన విజ్ఞాన విషయాలను చక్కగా వివరించారు ఎక్కువగా వాడుకలో ఉన్నది [ కఱ్ఱలరాపిడి ]అశని .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.