జైశ్రీరామ్.
ఆర్యులారా! తెలుగు మాతృభాషగా కలిగి సంతోషించేవారందరికీ నా అభినందనలు. శుభాకాంక్షలు.
తెలుగు భాషా వైతాళికుఁడు గిడుగురామమూర్తిగారి జన్మదినమును తెలుగు మాతృభాషాదినోత్సవంగా జరుపుకొంటున్నందులకు మనం గర్వపడుతున్నాము.
మన భాషకు ప్రపంచ స్థాయిలోనే చక్కని గౌరవం చిరస్థాయిగా ఉండేలాగ చేసేందుకు మన భాషాభిమానులు తప్పక ప్రయత్నిస్తుంటారు. అట్టి వారికి నా కైమోడ్పులు.
అట్టి వారిలో హాస్య బ్రహ్మ బిరుదాంకితులు శ్రీమాన్ శంకర నారాయణ గారొకరు. ప్రపంచ దేశాలలో మన తెలుగువాడిగా హాస్య బ్రహ్మగా మన పతాకం ఎగురవేసి తెలుగు ప్రజలందరికీ గర్వ కారణంగా నిలిచారు.
ఆ మహనీయునిచే "హాస్య మేథా యాగము" పేరుతో అత్యద్భుతమైన కార్యక్రమం ముషీరాబాద్ గాంధీ హాస్పటల్, ఎదురుగా ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతీ మందిరమున ఈ సాయంత్రం ఐదు గంటలకు జరగబోతోంది. ఔత్సాహికులు ఈ సదవకాశం సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను.
ఈ కార్యక్రమంతో పాటు కవిసమ్మేళనంలో తెలుగు తేజం శ్రోతల ఆనంద హేతువు కాగలదు.
ఈ కార్యక్రమములను సహస్రపద్య కంఠీరవ బిరుదాంకితులైన శ్రీ చిక్కా రామదాసు గారి అధ్యక్షతన నిర్వహింపఁబడుచున్న "తెలుగు సాహిత్య కళా పీఠము" అను సాహితీ సంస్థ నిర్వహిస్తోంది.
సాహితీప్రియులందరికీ అహ్వానం తెలియజేయడమైనది.
జైహింద్.
1 comments:
నమస్కారములు
రాలేకపోయిన నాలాంటివారికి అద్భుతమైన కార్యక్రమములను కన్నులకు కట్టినట్లు వివరించ గలరని మనవి .ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.