జైశ్రీరామ్.
ఆర్యులారా! తే.29-8-2015. తెలుగు భాషా దినోత్సవము సందర్భముగా
సహస్ర పద్య కంఠీరవ బిరుదాంకితులైన
శ్రీ చిక్కా రామదాసు
ఆధ్వర్యవములో నిర్వహింపఁబడుచున్న
తెలుగు సాహిత్య కళా పీఠము,
సాయంత్రం5 గంటలకు
గాంధీ హాస్పటల్ సమీపమున ఉన్న
జ్ఞాన సరస్వతీ దేవలయ ప్రాంగణమున
తెలుగు కవి సమ్మేళనము నిర్వహించుచున్నది.
తెలుగు సాహిత్యాభిలాషులందరూ ఆహ్వానితులే.
జైహింద్.
6 comments:
నమస్కారములు
తెలుగు భాషామ తల్లికి శతకోటి వందనములు
రామకృష్ణారావుగారూ,
తెలుగున నల్పసత్వుడను దెల్లముగా నటులయ్యు నాకునుం
తెలుగు కవీంద్రులందరును తీరిక చేసుక పోవు చోట పె
ద్దల బహుతీయనైన కవితారసధారల గ్రోల వచ్చు నా
గలిగెడు నూహ కాని బహుకష్టము కార్యభరంపు టొత్తిడిన్
కార్యక్రమం విజయంవంతం కావాలని ఆశిస్తున్నాను.
ముందుగా ఆహ్వానమునకు కృతజ్ఞతలు. నేను బెంగుళూరులో ఉన్నాను సోదరా! తేనె రుచులను పంచెడు తెనుగు కవులు--చేరి ఒకచోట పండుగ చేసి కొనగ -హృదయ ముప్పొంగి ఆనంద సదనమయ్యె- కవన ఝరులట ప్రవహింప కాంక్షసేతు. శుభాకాంక్షలతో.
ఆహ్వానమునకు కృతజ్ఞతలు. తేనె లూరెడు కవితన తెలుగు కవితె. పర్వ దినమిది కవులెల్ల పరవశింప . సారవంతంపు సాహిత్య సౌరులన్ని. నేడు దర్శింప నగునుగా నిశ్చయముగ!
శ్యామలరావుగారూ ,
' బహుతీయనైన ' సమసన
మహితముగద శ్యామలార్య ! మన పండిత ధీ
మహితులకు , ముదంబగు నా
కు , హితుడ ! సందర్భమునకు కూడి చరించెన్
రాజారావుగారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.