గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఆగస్టు 2015, మంగళవారం

శ్రీ కృష్ణ దేవరాయలు వారి 506 వ పట్టాభిషేక దినోత్సవానికి స్వాగతం

                                                                                                       జైశ్రీరామ్.
ప్రియ సాహితీ బంధువులారా! శుభమస్తు.
తేదీ 07 - 08 - 2015 న 
సాహితీ సమరాంగణా సార్వభౌముఁడు శ్రీకృష్ణ దేవరాయలవారి 
506 వ పట్టాభిషేక దినోత్సవమును
 శ్రీ  గుత్తి(జోళదరాశి) చంద్రశేఖర రెడ్డిగారి స్వగృహమున
 సాయంత్రం 4 గంటలకు
జరిపించ తలపెట్టినారు.
ఈ కార్యక్రమమున తెలుగు, సంస్కృత, కన్నడ, తమిళ సాహితీవేత్తలుపాల్గొనుచున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు సాహితీ సౌరభాన్ని ఆఘ్రాణించగలిన, వారికృషిని ప్రశంసించుచు పరిశ్రమించిన ఎనిమిది మందికి అష్ట దిగ్గజముల పేర సత్కారములను కూడ అందింప నున్నారు.
కార్యక్రమము జరుగు చిఱునామా:-
శ్రీ గుత్తి (జోలదరాశి)చంద్రశేఖర రెడ్డి,
15, మొదటి దశ. (1St Phase)
జయప్రకాశ నారాయణ్ నగర్,
వయా మియాపూర్,
హైదరాబాదు,
500 049.
దూర వాణి. 9177945559.
ఈ సందర్భముగా
సాహితీ ప్రియులందరికీ ఇదే మా ఆహ్వానం.
బ్లాగ్ మిత్రులందరూ తప్పక విచ్చేసి కార్యక్రమమును జయప్రదము చేయ వలసినదిగా కోరు చున్నాను.
జై హింద్.
Print this post

3 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

మంచి సమాచారం.వివిధ భాషావేత్తల కలయికతో భువనవిజయమై భాసిల్లుగాక.

కంది శంకరయ్య చెప్పారు...

శుభం!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చక్కని అహ్వానాన్ని అందించినందులకు ధన్య వాదములు .కార్యక్రమ వివరములను తెలియ జేయగలరు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.