జైశ్రీరామ్.
శ్లో. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్ధం అనుజ్ఞాం దాతుమర్హసి.
గీ. భవునికానందమును గూర్చువాఁడ! నీకు
వందనము సేతు గొనుమయ్య నంది దేవ!
శివుని దర్శనమిట నేను చేయనుంటి.
అనుమతించుమ! స్వామికి వినుతి చేసి.
భావము:- భక్తవత్సలుడవైన, సాంబశివునికి, ఆనందప్రదుడవైన ఓ నందీశ్వరా! నీకు నమస్కారము.
ఆ మహాదేవుని సేవించుట కొఱకు నాకు అనుజ్ఞ ప్రసాదించుము.
జైహింద్.
5 comments:
నమస్కారములు
అసలు నందీశ్వరుని ముందుగా ప్రార్ధించా లన్నసంగతి తెలియదు .చాలా బాగుంది నిజంగా మన సంస్కృతి మేలిమి బంగారమె .ధన్య వాదములు
ధన్యవాదాలు
Chala Baga artham itudi,
నందీశ్వరుని ప్రార్ధన చక్కగా వివరించి నదులకు ధన్యవాదములు
anjineyulubasr@gmail.com
చాలా మంది పండితులకు కూడా ఈ శ్లోకం రాదు....డైరెక్ట్ శివాభిషేకం చేస్తారు.కానీ చక్కగా వివరించారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.