గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మార్చి 2015, మంగళవారం

గజేంద్ర మోక్షము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! మనలో నెలకొని యున్న మదమనే గజము ఐచ్ఛిక ప్రవృత్తికి పురికొల్పినప్పుడు సంసారమనే మొసలి మనను పట్టుకోవడం తప్పక జరిగే పని. అప్పుడు మనపూర్వజన్మ పుణ్యఫలముగా మనకు కనువిప్పు కలిగితే మనం ఆ శ్రీహరిని రక్షించ వలసినదిగా ప్రార్థిస్తాము. చక్రధారి కరుణించాడో మనకు భవ బంధాలనుండి విముక్తి లభిస్తుంది. అంతటి భాగ్యం మనకు కలగకపోతే ఈ సంసార దుఃఖ సాగరంలో కొట్టిమిట్టాడుతూ ఉండడం తప్ప చేయగలిగిందేమీ లేదు. నిజంగా మనం మన అజ్ఞాన ప్రవృత్తికి పశ్చాత్తాపం పొందుతున్నట్లైతే తద్విముక్తిని మనసారా కాంక్షిస్తే మాత్రం మనం తప్పక గజేంద్ర మోక్ష ఘట్టాన్ని నిత్యం పారాయణ చేయాలి. అప్పుడు ఆ పరమాత్మ తప్పక మనలను రక్షింపక మానడు. అందుకే ఈ క్రింది గజేంద్రమోక్షాన్ని విందాం. ముక్తిమార్గం కనుగొందాం.

జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజంగా ఈ గజేంద్రమోక్షం గంగావతరణం లాంటివి కొన్ని ఎన్నిసార్లు విన్నా చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనీ వినాలనే ఉంటుంది
శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు

వై.రాధాకృష్ణా రావు చెప్పారు...

అద్భుతము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.