గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జనవరి 2014, మంగళవారం

శ్రీ కందుల వరప్రసాద్ రచించిన గోపుర బంధము.

జైశ్రీరాం. 
ఆర్యులారా! 
శ్రీ కందుల వరప్రసాద్ రచించిన గోపుర బంధమును తిలకించండి.







శ్రీ  











సే
కు









శ్రీ  
రు
యి







భా
సి
ల్లె
డు
క్త





రు
డు
రు
డు
భు
విన్



జే
సె
ము
రి
పు
తి
యి

బా
నే
గాం
చి
యే
లు
వై
కుం
ము
నన్













శ్రీసేవకు శ్రీకరుడయి,
భాసిల్లెడు   భక్తవరుడు, భవహరుడు భువిన్ 
జేసె రణము రిపుతతిపయి,
బాసలనే గాంచి యేలు వైకుంఠమునన్!
భావము : లక్ష్మీ దేవి సేవలతో సంపత్కరుడై, భవ హరుడు ప్రకాశించుచు భువిలో రాక్షస గణమును ద్రుంచి, సద్భక్తులను వైకుంఠమునకుగొనిపోవును.
జైహింద్
Print this post

3 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
బంధ కవిత్వములతో బంధిస్తున్న శ్రీ వరప్రసాద్ గారి ప్రతిభ శ్లాఘనీయం సోదరులకు అభినందన మందారములు

Pandita Nemani చెప్పారు...

CONGRATULATIONS

Unknown చెప్పారు...

గురువు గారికి ధన్యవాదములు !
శ్రీ కందుల వరప్రసాదు గారి గోపుర బంధము పద్యము చాలా బాగున్నది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.