జైశ్రీరాం.
ఆర్యులారా! ఈ క్రిందిది పఠించి ఈ విషయామై మీరూ ఆలోచించండి.
"పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం" ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు: సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం లో కలుపు సమస్యే కాదు. రసాయనిక ఎరువులు, టన్నుల కొద్దీ వేస్తున్న పశువుల ఎరువులతోనే కలుపు రైతులకు తీవ్ర సమస్యగా మారుతోంది. సక్రమంగా ఆచ్ఛాదన కల్పించి, జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయి. జీవనద్రవ్యంతో కూడిన భూసారాన్ని పరిరక్షించుకోవడం అవసరము. మెట్ట పొలాల్లో ఆచ్ఛాదనకు గడ్డి లేకపోతే భూమిని పైపైన దుక్కి చేసి మట్టి పెళ్లలతో ఆచ్ఛాదన కల్పించవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి ఎరువూ వేయనక్కర లేదు. నాటు ఆవు పేడ, మూత్రంతో తయారైన ‘జీవామృతం’లో కోటానుకోట్ల సూక్ష్మజీవు లుంటాయి. కర్నాటక, కేరళ ప్రభుత్వాలు యీ విధానాన్ని ఆమోదించి శిక్షణాశిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఒక్కో రాష్ట్రంలో పది లక్షల మంది ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు.
ఈ వ్యవసాయంలో మన దేశీయ గోవులది ప్రధాన పాత్ర. దేశీ ఆవుల మూత్రంలో , పేడలో ఎన్నో ఉపయోగకరమైన మిత్రక్రిములున్నాయి , కేవలం వాటి ద్వారా మాత్రమే మనం భూమిని సారవంతం చేయవచ్చు. 1 గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మిత్ర క్రిములున్నాయని శ్రీ సుభాష్ పాలేకర్ గారు రుజువు చేసారు . జెర్శీ ఆవుకు , దేశీ ఆవుకు ఎన్నో తేడాలున్నాయి. దేశీ ఆవు పేడలో, మూత్రంలో ఉన్నన్ని మిత్రక్రిములు జెర్సీ ఆవుతో సహా మరే ఇతర జంతువు మల మూత్రాలలో కూడా లేవు. పైగా వాటి మల మూత్రాలలో మానవునికి కీడు చేసే భారీ లోహాల మిగులు , హాని కారక క్రిముల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. పాల విషయంలో కూడా జెర్సీకి , దేశీ అవుకు చాలా తేడాలున్నాయి. జెర్సీ ఆవు పాలలో " A 1 బీటా కేసిన్ " అనే కాన్సర్ కారక ప్రోటిను ఉంటుంది , దేశీ ఆవు పాలలో " A 2 బీటా కేసిన్ " అనే ఔశద ప్రోటిను ఉంటుందని పరిశోదనలు తెలుపుతున్నాయి. విదేశీయులు మనకు జెర్శీ ఆవులను అంటగట్టి వారు మత్రం మన దేశీ ఆవుల ద్వారా లభించే A 2 పాలను సేవిస్తున్నారు . జెర్సీ ఆవు ( శాస్త్రీయ నామం :- బాస్ టారస్ ) జన్యు క్రమములో , దేశీ ఆవు ( శాస్త్రీయ నామం :- బాస్ ఇండికస్ ) జన్యు క్రమంలో తేడాలున్న కారణంగానే అది దేశీ ఆవుతో సమానం కాదు . కావున దేశీ ఆవులను కాపాడవలసిన ఆవశ్యకతను ప్రజలకు తెలయజెప్పి , వాటిని పరిరక్షించి దేశాన్ని , రైతులను కాపాడాలనేది నా దృఢ సంకల్పం.
బ్రెజిల్ దేశంలో మన దేశీ ఆవుల ద్వారా లభించిన " బ్రాహ్మిణ్ " జాతి ఆవుల ద్వారా రోజుకు 40 లీటర్ల ఆరోగ్యకరమైన A2 పాలను పొందుతున్నారు . మన దేశీ ఆవులు ఎటువంటి కరువు పరిస్థితులనైనా తట్టుకొని జీవిస్తాయి. పాలను పొందడానికి "ఆక్సిటోసిన్" లాంటి హానికారక హార్మోనులను ఎక్కించవలసిన పనిలేదు. రోగ క్రిమి నాశక మందులను ప్రతి నెలా ఇవ్వనవసరం లేదు. శీతలీకరణ పరికరాలను అమర్చవలసిన పనిలేదు . మన దేశి ఆవులను పెంచడం చాల సులభం. దేశీ ఆవులలోని కొన్ని జాతులను సంకరపరిచి ఎక్కువ పాలిచ్చే జాతిని పెంపొందించవచ్చు. ఇలా చేయడం వల్ల మన రైతులు మన దేశీ ఆవుల పెంపకంపై ఆసక్తి చూపి , వాటిని పెంచి లాభం పొందుతారు.
గోమాతను పూజించండి మానవత్వాన్ని కాపాడండి.
సుభాష్ పాలేకర్.
జైహింద్
1 comments:
సుభాష్ పాలేకర్ లాంటివారి పరిశోధన లు విదేశీపాలకులుఅందిపుచ్చుకుంటారు గానీ మనచర్మమమ్దం నాయకులకు పట్టదు. ఇదీ మన దౌర్భాగ్యం
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.