గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఆగస్టు 2013, మంగళవారం

సహస్ర పద్య కంఠీరవ శ్రీ చిక్కా రామదాసు విలిఖించిన ఒక మంచి మాట.

జైశ్రీరామ్.
ఆర్యులారా!  సహస్ర పద్య కంఠీరవ బిరుదాంకితులైన శ్రీ చిక్కా రామ దాసు విలిఖించిన ఒక మంచి మాటను చదివి చూడండి. ఎంతటి మహోన్నత భావనాభరితమో అర్థమౌతుంది.
జైహింద్.
Print this post

4 comments:

SCHOOLS VISION చెప్పారు...

కడుప్రశంసనీయం

SCHOOLS VISION చెప్పారు...

గురువు గారు వందనాలు .......
నాకు పద్యరచనలో సాధువులు.. సాధువులు కానివి యేవో తెలుసుకొనుట కష్టంగానున్నది....దయచేసి ఉదాహారణ లతో విరించమని ప్రార్థన....

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సహస్ర పద్య కంఠీరవ బిరుదాంకితులు పూజ్యులు శ్రీ రామదాసు గారికి ప్రణామములు
మంచి ఆణి ముత్యాలను అందించారు నిజమే ఒక్క మంచి మాటె కదా ఎదుటి వారిని సంటొష బెట్టినా నొప్పించినా ? అందుకే అన్నారు ....మాటల చేత దేవతలు మన్నన జేసి వరంబు లిత్తురు అని .చాలా బాగుంది అందరు పాటించ వలసిన సూక్తి ముక్తావళి .ధన్య వాదములు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చిరంజీవీ! శుభమస్తు.తీరిక లేక సమాధానం వ్రాయటంలో ఆలస్యమైంది. అన్యధా భావింపవలదు.
పద్య రచనలో సాధువులు అంటే దోష రహితంగా, మనోరంజకంగా ఉండే పద్యాలు.
అసాధువులు అంటే దోష భూయిష్టమై యున్న పద్యాలు.
దోషములు ఎలా తెలుస్తాయి? అనే ప్రశ్న కలుగ వచ్చును.
౧)దశ దోషాలు లేకుండా ఉండాలి
౨) చ్ఛందస్సును పట్టి గణములు సరిపోవాలి. గణములలో గురులఘువులు తప్పుగా వస్తే గణము మారిపోతుంది.
౩) యతి నియమం ఉండ వలసిన చోట తప్పక పాటించాలి. యతి మైత్రి గల వర్ణములే యతిస్థానంలో వెయ్యాలి. ఆ విధంగా ఉండకపోతే యతి తప్పి దోషభూయిష్టం ఔతుంది.
౪)ప్రాస స్థానంలో ప్రాసాక్షరం నియమానుసారం ఉండాలి. లేకపోతే ప్రాస తప్పిన దోషం ఉంటుంది.
౫)దుష్ట సమాసాలు ఉండకూడదు.
౬)సందర్భాన్ని బట్టి ఏ చ్ఛందస్సుతో కూడిన పద్యం యోగ్యంగా ఉంటుందో ఆచ్ఛందస్సు గల పద్యమే ఆ సందర్భములో వ్రాయాలి.
ఉదాహరణకి ఒక క్న్యను వర్ణించే సందర్భంలో ఉత్పలమాలనో చెంపకమాలనో వాడాలి. శార్దూలము, మత్తేభము ప్రయోగించుట అనౌచిత్యమే ఔతుంది.
ఆంధ్రామృతంలో ఈ విషయాలు ప్రాత టపాలలో ఉన్నాయి కొంచెం ఓపికగా వెదికి తెలుసుకో వలసినదిగా నా కోరిక.
శుభమస్తు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.