గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఆగస్టు 2013, గురువారం

డా.నండూరి రామ కృష్ణమాచార్య విరచిత పద్యసుమాలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! ప్రముఖ మహా కవి అభినవ వేమన డా.నండూరి రామ కృష్ణమాచార్య విరచిత పద్యసుమ సౌరభాలను ఆఘ్రాణించండి.
ఆసక్తి కల విద్యార్థినీ విద్యార్థులు ఈ పద్యములలో ఇరువదైదింటిని నిర్దోషముగా అప్పగించ గలిగిన వారికి 300 రూపాయలు,  ఏబది అప్పగించిన వారికి 500 రూపాయలు, నూరు పద్యములు అప్పగించిన వారికి 1000 రూపాయలు పారిరోషకంగా ఇస్తామని శ్రీ నండూరి కృష్ణమాచార్యుల వారి పుత్రులైన శ్రీ శోభనాద్రిగారు ప్రకటించారు.
సులభ శైలిలో ఉన్న యీ పద్యములు కంఠస్థమైనచో సందర్భానుసారముగా చెప్పి శ్రోతలను మెప్పింప వీలగును. కాన మీరు కూడా యీ విషయమును ప్రచారము చేసి, విద్యార్థులలో తెలుగు పద్య పఠనాసక్తిని పెంపొందించ గలరని ఆశిస్తున్నాను. ఈ పోటీలో పాల్గొన గోరువారు.9848271124 నెంబరుకు ఫోన్ చేసి శోభనాద్రి గారితో సంప్రదింప వచ్చును. శుభమగుగాక.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అలతి అలతి పదములతో అంద మైన పద్యములను అందించిన శ్రీ నండూరి రామ కృష్ణ మాచార్యుల వారికి శిరశాభి వందనములు .తెలుగు పద్యం మరుగున బడుతున్న ఈ రోజుల్లో వారి పుత్రులు శ్రీ శోభనాద్రి గారు చేపట్టిన కృషి ముదావహం .ఇక్కడ కుడా మనబడి కార్య క్రమంలో తెలుగును అభి వృద్ధి చేస్తున్నారు .ముందు ముందు పెద్దల కృషి ఫలితంగా తెలుగు యుగం కాగలదు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.