జైశ్రీరామ్.
శ్లో|| లేఖకో భారత స్యాస్య భవత్వం గణనాయక
మయైవ ప్రోచ్య మానస్య మనసా కల్పితస్య చ .
హే గణనాయక! మయైవ మనసా కల్పితస్య, ప్రోచ్య మానస్య చ అస్య భారత స్య లేఖకః త్వం భవ.
మనమున నూహించుచు నే
ఘనముగ పలికంగనున్న ఘన భారతమున్
విని వ్రాయుము లేఖకునిగ,
గణనాధుఁడ! విఘ్న రాజ! ఘనముగ నిలువన్.
భావము: ఓ గణేశా నీవు ఈ భారతానికి లేఖకుడిగా వుండుము. నేను నా మనస్సు చేత ఊహించి నీకు చెబుతాను.
ఆగణపతి లిఖించిన వ్యాస భారతమే మన భారతీయ సంస్కృతీ సంప్రదాయములకు ముకురమై, మూలమై నిలిచినది.
గణ నాధుఁడ! నీ కృపచే
వినఁ గలుగుట సంభ వించె విస్తృతముగ నీ
ఘనతర భారత గాథను.
ఘన చరితుఁడ! వదనములు.గైకొనుమయ్యా!
జైహింద్.
2 comments:
భారత సంహితారచన వ్యాసు డొనర్చుచు వారణాస్యునిన్
గోరగ నాశులేఖనము కూరిమి చేయుమటంచు నొప్పుగా
భారతమెల్ల వ్రాసె ముని వంద్యుడు సత్కవి విఘ్ననాథుడా
భూరి కృపాళు దివ్య పద పుష్కర యుగ్మము నే భజించెదన్
బాగుంది
వ్యాస గణ నాధుల చక్కని చిత్రం . ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.