జై శ్రీరామ్.
శ్లో: దానేన భోగీ భవతి - మేథావీ వృద్ధ సేవయా.
అహింసయాచ దీర్ఘాయుః - ఇతి ప్రాహుర్మనీషిణః.
క: దానముచే భోగంబులు,
జ్ఞానము సద్వృద్ధ సేవ సలుపుట వలనన్
ప్రాణుల హింసింపమిచే
మానిత దీర్ఘాయువమరు. మరువకుడయ్యా.
భావము: దానములు చేయుట వలన భోగిగాను, వృద్ధుల సేవ వలన జ్ఞానిగాను, అహింస వలన చిరాయుష్మంతుడుగాను మానవుఁడు అగునని మహాత్ములు చెప్పియున్నారు.
జైహింద్.
5 comments:
గత కలంబు మేలు వచ్చు కాలము కంటెన్ అని నన్నయ గారు అన్నారు. అది చూచుకుని మురిసి పోవలసిందే ఎందుకంటె ఇప్పుడు కడుపు మండించే విషయం రాష్ట్ర విభజన విడి పోవలనుకునే వారికి యెంత సంస్కారం బోధించినా బురదలో పోసిన పన్నీరే
గురువు గారు
నమస్సులు ....
మన వి ...పద్య రచనలో సాధురూపాలు ,సాధురూపాలు కానివి ఉదాహరణ లతో వివరించ ప్రార్థన

నమస్కారములు
మంచి విషయాలను తెలియ జెప్పారు కానీ నేడు మహాత్ముల బోధలు అరణ్య రోదనే
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.