ఆ.వె.
రమ్యసుగుణధామ! రావణసంహార!
రఘుకులాబ్ధిచంద్ర! యఘవిదార!
రక్తితోడ నిన్ను ప్రార్థింతు మనసార
రమ్ము నన్ను బ్రోవ రామ! ధీర!
Print this post
రమ్యసుగుణధామ! రావణసంహార!
రఘుకులాబ్ధిచంద్ర! యఘవిదార!
రక్తితోడ నిన్ను ప్రార్థింతు మనసార
రమ్ము నన్ను బ్రోవ రామ! ధీర!
చూచారు కదా! ఎంత చక్కగా శ్రీ కంది శంకరయ్య గారు వ్రాసారో! మనమూ ఇట్టి చక్కని రచనలవలన స్ఫూర్తి పొంది వ్రాయడానికి ప్రయత్నించినపుడే ఇట్టి చక్కని రచనలు చేసినవారి కోరిక తీరుతుంది.
జై శ్రీరాం.
జైహింద్.
1 comments:
మాన్యులు శంకరయ్యగారు చేసిన ఢాల బంధ రచన చూచుట వలన కలిగిన ప్రేరణతో నేను వ్రాసిన ఢాల బంధము గమనింప మనవి.
గీ:-
రమ్య గుణ ధాము శ్రీరఘు రాము గనర!
రక్ష గొలిపెడు నామము రామ వినర!
రశ్మినొడఁ గూర్చు నక్షర రామ యనర!
రత్న కాంతులు విదజల్లు రాము గొనర.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.