గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, జులై 2011, మంగళవారం

చెప్పుకోండి. చూద్దాం? ( గూఢోత్తరము అనే రచనా ప్రక్రియ. )



సాహితీ ప్రియులారా!
ఈ క్రింది శ్లోకములో గల ప్రశ్నకు సమాధానం చెప్ప గలరా?
స సర్వ బుధ గీర్మాన్యః  పరారిర్భృత్య రాజ్యదః.
మాయీమేశం కం సు శబ్దం రక్షణం సువ్రతో జగౌ?
సమాధానం మీరు చెప్ప గలరని నాకు తెలుసు.
ఒక వేళ చెప్పలేమని అనిపిస్తే  శ్లోకారంభం నుండి బేసి అక్షరాలన్నిటినీ కలిపి చూడండి. మీరు చెప్ప వలసిన సమాధానం లభిస్తుంది.
బాగుందా? మీ అభిప్రాయం వ్యక్తం చేసే హక్కుతో పాటు, చక్కని సూచనలనివ్వ వలసిన బాధ్యత కూడా మీపై ఉందని మరువకండి. మీ దృష్టిలో గల ఇటువంటి చమత్కార భరిత పద్యాలను ఆంధ్రామృతం ద్వారా పాఠకులకందించడం కోసం వ్యాఖ్య ద్వారా పంపంపండి. ధన్యవాదములు.
జై శ్రీరాం.
జైహింద్.
Print this post

4 comments:

Sanath Sripathi చెప్పారు...

చాలా బాగున్నవి. సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ.

రాఘవ చెప్పారు...

ఇటువంటిదే ఒకటి ప్రయత్నించాను... చూడండి

రాజీవలోచనశ్శ్రీమాన్ నశ్యామలదేహకః,
వః కుర్యాత్ మంగళం రామః సీతాజానిః కృపాంబుధిః :)

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చిరంజీవీ! రాఘవా! నీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను.

రాజ ఘన వజ్ర సంఖ్య కరాల్పడు మును.
సమ ఫల లవమ యగు శ్రిత, జన ప్రియదము,
విధజ శ్రేయదము. విభుని విశ్వశులభ
కల రవము. వినదగును. నికరము. వరధి!
( రాఘవ సంకల్పము సఫలమగుత. నయము, విజయము, భువి శుభకరము నగు నిరవధి)

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీపతీ! శుభమస్తు.
చక్కగా గుర్తించారు ఈ పద్యంలో గల ఆంతర్యాన్ని. అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.