గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, జులై 2011, బుధవారం

గోపుర బంధ కందము ( చిత్ర కవితాభ్యాసము )

ఆంధ్రామృత పాన లోలులారా! బంధ ప్రబంధ కవితాభిలాషులారా! 
కందం వ్రాస్తే కవి అనమన్నారు.  మీరు కూడా కంద పద్య రచానా సమర్ధులే కదా! ఐతే మీరూ కవేనన్న మాట. సంతోషం. 
ఐతే మీరు కూడా బంధ కవిత్వము  చేయడమనేది పెద్ద పనేం కాదు కదా! 
ఈ క్రింది గోపుర బంధం చూడండి.  మీరూ వ్రాయడానికి ప్రయత్నించండి. 
గోపుర బంధము.
శ్రీ కామౌ రుఁడవు .
నీకుం  గడు భక్తి యుతుఁడ. నిను రి! కొలువన్ 
నా కవిత మురియు. నిరుపమ
శ్రీకర! నన్ గాంచి, యేల చేరం దగదే?

{బొమ్మపై క్లిక్ చెయ్యండి}
ఏమంటారు. సులభంగానే వ్రాయ కలరు కదూ? ఐతే ఇంకా ఆలస్యమెందుకు? వ్రాసి వ్యాఖ్య ద్వారా పంపండి.
నమస్తే. 
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.