బంగరు పల్లె సీమలను, పచ్చని పైరుల మధ్య, మెల్గు యే
బెంగయు లేక, నిత్యము నవీన మనోజ్ఞ సుపూజ్య భావనా
రంగముగా ముఖాబ్జమది రాజిల వర్తిలు బాలికా మణీ!
నింగియు నేలయున్ సరియె నీ మది వెల్గెడి కాంతి కోటికిన్?
పల్లెయె తల్లిగా కలిగి, పచ్చని పైరుల తోడఁ బుట్టువై,
మల్లెమనంబుతో వెలుగు మానిని! నీ యభిమాన సంపదన్
మల్లెలు, మంచి గంధము, సమంచిత చంద్రిక, సన్న జాజులున్,
తెల్లము చేయ తేజరిలు. తెల్పగఁ జాలక క్రుంగు. కంటివే?
నిత్య వసంత శోభ యది నేలకు వచ్చె ననంగ నున్న, యౌ
న్నత్యము సత్స్వభావమున నల్వురు మెచ్చగ కల్గియున్న యో
సత్య సురూప తేజమ! ప్రశస్తిని గొల్పితివమ్మ భూమికిన్
నిత్యము శోభనీయమగు నీవు వసించుటఁ జేసి. బాలికా!
కట్టెలతోడ వంటకము కమ్మగ జేయగ చూచుచుంటివా?
మట్టెలు పెట్టు వాని యభిమానము పొందగ జాలుదీవు. నీ
మెట్టిన యిల్లు స్వర్గమగు. మిద్దెలు మేడలవేల? నిన్ను చే
పట్టిన వాని జన్మమది భాగ్యమనంగ వసింతు వీ వటన్.
మాయా మర్మము లెన్న లేని, ఘన సమ్మాన్యార్హ సద్వర్తనల్,
ధీయుల్ మెచ్చెడి సత్స్వభావనములుద్దీపించు సంసేవలున్,
శ్రేయోమార్గము పల్లెవాస మని నీ చేతల్ నిరూపించు. యీ
మాయా పట్టణ జీవనమ్ము కనితే! మా పల్లె కాంతామణీ!
జైశ్రీరాం.
జైహింద్.

4 comments:
చాలా బావుంది మాస్టారు.
ఫోటో ఎంత బాగుందో! మీ కవిత కూడా బాగుంది.
మాధురి.
మీ భావ మాలిక, చిత్ర పటమూ చాలా బాగున్నవి.
మీ రచనల్లో అత్యుత్తమమైనది ఇదే. ఎలానో ఇదివరకు చదవడం మర్చిపోయాను. కరుణశ్రీ, విద్వాన్ విశ్వం - వీరిద్దరి శైలి మిళితమై, వారిద్దరికన్నా ఒకింత అందంగానే వ్రాశారండి. అత్యద్భుతం.
కట్టెలతోడ వంటకము కమ్మగ జేయగ చూచుచుంటివా?
మట్టెలు పెట్టు వాని యభిమానము పొందగ జాలుదీవు. నీ
మెట్టిన యిల్లు స్వర్గమగు. మిద్దెలు మేడలవేల? నిన్ను చే
పట్టిన వాని జన్మమది భాగ్యమనంగ వసింతు వీ వటన్.
- ఆహా, ఎంత కమ్మగా వ్రాశారు?
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.