అధ్యాత్మ రామాయణం.యుద్ధ కాండ.15వ సర్గ.32 వ పద్యము.
ప్రియ పాఠకులారా!
అసాధారణ భక్తి సమన్వితులైన శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు అవధాని చక్కని సుప్రసిద్ధ కవి. వారు రచించిన అధ్యాత్మ రామాయణము నుండి మనము సర్వ లఘు సీసమును కూడా చూచి మనలో చాలామంది అట్టి సీసపద్యాలను వ్రాయడం కూడా జరిగింది కదా!
ఆ మహాకవి శ్రీ చక్ర భూషణము అనే పేర వెలయించిన బంధ కవితను మీ ముందుంచడానికి చాలా ఆనందంగా ఉంది.
పైన గల పటములో శ్రీచక్రభూషణము పటముతో పాటు దాని క్రింద తేటగీతి పద్యము కూడా ఉంది.
ఐనా గాని స్పష్టముగా తెలియుట కొఱకు మరల అదే పద్యము ఈ క్రింద వ్రాయు చున్నాను.చూడుడు.
తే.గీ.ll
జగ దదీశ్వర! శ్రీరామ! సర్వ రక్ష!
కమల లోచన! శ్రీశ! రక్షః ప్రణాశ!
వరద! కాకుత్స్థ! శ్రీద! కృపా నిధాన!
జనకజావర! క్షత్రేశ! జ్ఞాన తేజ!
ఇది ఈ మహాకవి రచించిన శ్రీమదధ్యాత్మ రామాయణము అను తెలుగు పద్య కావ్యమునందలి యుద్ధ కాండమున 15 వ సర్గలో 32 వ పద్యము.
చూచారు కదా! ఎంత అలవోకగా పద్యాన్ని సర్వ హృద్యంగా వ్రాసారో! వారి రచనలోని మరికొన్ని ఆణిముత్యాలను మళ్ళీ సమయం దొరికినప్పుడు తప్పకుండా గ్రహిద్దాం.
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post
1 comments:
హృద్యంగా ఉన్నది. అక్షరాలను కూడా అందంగా మలిచారు కవీశ్వరులు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.