శ్లోll
వ్యాసమ్ ; వశిష్ఠ నప్తారమ్; శక్తేః పౌత్రమకల్మషమ్;
పరాశరాత్మజమ్ వందే శుకతాతమ్ తపోనిధిమ్.
గీll
మునివరేణ్య వశిష్ఠుని మునిమనుఁడును.
శక్తి పౌత్రుండు నకళంక భక్తి యుతుఁడు;
వర పరాశరాత్మజుఁడును; ధర శుకునకు
తండ్రి; యగువ్యాస గురువును తలతు భక్తి.
భావము:-
వశిష్ఠుని ముని మనుమఁడును; శక్తి మహర్షి యొక్క పౌత్రుఁడును; నిష్కల్మషుఁడును; పరాశర ముని కుమారుఁడును; శుక మహర్షికి తండ్రియును; తపోనిధియును; అగు ఆది గురువయిన వ్యాస భగవానులవారికి నమస్కరింతును.
వ్యాస పౌర్ణిమ సందర్భంగా గురు దేవులకు వందనములు.
జై శ్రీరామ్.
జైహింద్.
3 comments:
వ్యాస పూర్ణిమ సందర్భంగా మీరు వ్యాస గురువునకు నుతులు సమర్పించుట మిక్కిలి సమయోచితంగా ఉంది.
వ్యాస పూర్ణిమ సందర్భంగా పద్యం హృద్యం. వ్యాసుల వారి చిత్రం అద్భుతం.గురువు గురువుని పూజించటం ముదావహం.
చిన్న ముద్రారాక్షసం దొర్లింది. శుకతాతమ్ అని ఉండాలి. మీ మనవరాలి బ్లాగులోనూ వ్యాసుల వారిమీదే ముద్రారాక్షసం దొర్లడం యాదృచ్చికం. :-)
గురుభ్యోన్నమః|
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.