గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జులై 2010, గురువారం

చక్ర బంధ తేట గీతము.


చక్ర బంధ తేట గీతము.
సభల లోపల నన్ గాంచు సౌమ్య! భావి
లఘుత మాపి; మనన్ జేయు రమ్య ధీశ !
క్షితిని నీ వాఁడ! ; నన్ దేల్చు శ్రీ సుధామ!
సకల సాక్షివి విశ్వేశ! సామ భాస!
భావము:-
మంచి మాటలలో ప్రకాశించు వాఁడా! ఓ లోకేశ్వరా! పండిత సభలలో నన్ను కరుణతో చూచెడి ఓ సౌమ్య స్వభావుఁడా!భవిష్యత్తులో తక్కువ తనము లేకుండా చేసి; నన్ను మనునట్లుగా చేసెడి ఓ రమ్యమైన జ్ఞాన మూర్తివైన ఓ ప్రభూ! భూమిపై నేను నీ వాడను సుమా! ఓ మంచికి నిలయమైన వాఁడా! నన్ను ఈ సంసార బంధనములనుండి తేల్చి; రక్షింపుము. 
జై శ్రీరామ్.
జైహింద్.
Print this post

10 comments:

Unknown చెప్పారు...

చక్రం బొమ్మ కనబడలేదండీ. సరిచేయగలరు.

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
సురేష్ బాబు చెప్పారు...

బాగుందండి పద్యము. కాని మీరు పెట్టిన బొమ్మ ఏంటో సరిగా కనబడ్డంలేదు.

సురేష్ బాబు చెప్పారు...

అసలు ఆ బొమ్మ ఏంటో అర్థం కావడం లేదండి.

సురేష్ బాబు చెప్పారు...

చిత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఇలాంటి ప్రక్రియలు కొన్ని ఉన్నాయనే విషయమే తెలియదండి. చాలా కొత్త కొత్త సాహిత్య ప్రక్రియలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలండి.

రవి చెప్పారు...

ఇప్పుడు బొమ్మ బానే కనిపిస్తున్నదండి.

ఇంతవరకు మీరు వ్రాసిన బంధా కవితల్లో నాకు నచ్చిన అత్యంత సుందరమైన బంధం ఇదే. మూడు పాదాల్లో ఒకే చోట ఆవృత్తి, చివరి పాదంలో ఒక అక్షరం విడచి మరియొకటి ఆవృత్తి - చాలా అద్భుతంగా ఉంది.

కొండముది సాయికిరణ్ కుమార్ చెప్పారు...

చాలా బాగుందండి.

ఇది చక్రబంధం లానే ఉందికానీ, శ్రీచక్ర బంధంలా లేదు.. అసలు, శ్రీచక్రబంధంలో ఎవరైనా వ్రాసారా?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సాయి కిరణ్ కుమార గారూ! మీరు చెప్పినట్టు ఇది చక్ర బంధమే.
శ్రీ = మంగళప్రదమైన
చక్రబంధమని నా ఉద్దేశ్యము.
శ్రీ కేంద్ర స్థానంలో ఉంచి పద్యం వ్రాస్తే అది శ్రీచక్ర బంధమనబడ వచ్చును.
ఇక మీరన్నట్టు శ్రీ చక్రమ్ వేసి మద్యమ్ వ్రాసినవారున్నారో లేరో పరిశీలించి చూడాలి. ఐతే కాదేదీ మన కసాధ్యం. ప్రయత్నిస్తే వ్రాయడం పెద్ద పనేం కాదని నా నమ్మకం.
మీ స్పందనకు ధన్యవాదములు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

బహు సుందరం!! అభినందనలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చక్ర బంధం చాలా బాగుంది తమ్ముడు ! అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.