చ‘తురంగ’గతి బంధ కందము:-
సుమధుర కవితల చతుర ప
దము లురు తురగ గతిఁ దనరి; తగ మునుగ పడున్.
భ్రమ పడ నిడుపుగ చెలగిన
యిమడవు. విని; దిగులు గొనక యెఱుగుడు రచనల్.
భావము:-
మంచి మధురమైన కవిత్వములలో చతురమైన పదములు గొప్ప చతురంగమున తురంగ గమనముతో నొప్పి; తగిన రీతిలో ముందుగానే ప్రయోగింపఁ బడును. భ్రాంతి గొలిపే విధముగా హ్రస్వాక్షరములు పదమునకు నాలుగు కంటే ఎక్కువగా పెరిగి శబ్దించినచో యీ చతురంగ గతిని యిమడవు సుమా! ఈ విషయమునాలకించి; దిగులు పడక రచించు విధానమును తెలుసుకొనుడు.(రచింపుడు)
సు మ ధు ర క వి త ల
చ తు ర ప ద ము లు రు
తు ర గ గ తిఁ ద న రి;
త గ ము ను గ ప డు న్.
భ్ర మ ప డ ని డు పు గ
చె ల గి న; యి మ డ వు.
వి ని; ది గు లు గొ న క
యె ఱు గు డు ర చ న ల్
ఆ శారదాంబ నుపాసించే సుజన మనో రంజకులగు మీరు కూడా చతురంగ బంధ ఛందములో పద్య రచన కుపక్రమింప గలందులకు ఆశించు చున్నాను. నా ఆశ వమ్ము కాదని నా నమ్మకము.
జై శ్రీరామ్.
జైహింద్.
5 comments:
సరళంగా, సుందరంగా ఉంది. ఎంచేతో, చతురంగ బంధము, నక్షత్ర బంధము ఎంత ప్రయత్నించినా అంతు చిక్కట్లేదండి. మళ్ళీ ప్రయత్నిస్తాను.
రవి గారి ప్రయత్నం నేనూ చేసాను. కాని సాధ్యం కాలేదు. మరోసారి ప్రయత్నించి చూస్తాను.
Mamatala samatala kolanila
Kamalamulaku,nelavunaguchu kamalayuvelayan
Vimaludu kuvalaya subhakaru
Damaludu sirivaradudu
Bhavaharu harigoluthun
-Vallabhavajhala Appala
Narasimhamurthy, Juttada
శ్రీ వల్లభ వజ్ఝల అప్పల నరసింహ మూర్తి గారు రచించిన చతురంగ గతి బంధ కందము వారు ఆంగ్లంలో పంపగా దానిని నేను తెలుగు లిపిలో ఇక్కడ మీముందుంచుతున్నాను.
క:-
మమతల సమతల కొలనిల
కమలములకు నెలవునగుచు కమలయు వెలయన్
విమలుఁడుకువలయ శుభకరు
డమలుఁడు సిరి వరదుఁడు భవ హరి నిట గొలుతున్.
ఆర్యా!నరసింహ మూత్రిగారూ! నమస్తే,.
నేను వ్రాసిన చతురంగ గతి బంధ సర్వ లఘు కందాన్ని దయచేసి చూడండి.
అందులో
తురగము
పగిదిని
నడపుడు
పదములు.
అని నాలుగు గుఱ్ఱపు గతులతోనొప్పెడి పదములున్నాయి.
అవి అన్నీ కలిపి చదివితే ఒక పరిపూర్ణమైన అర్థం వస్తుంది.
అలాగే మీరూ వ్రాసి ఉంటారు.
ఐతే ఆ పదాలను నేను గుర్తించ లేకపోతున్నందున మీరు తెలియఁ జేయ వలసినదిగా మనవి చేయు చున్నాను.
నమస్తే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.