మృత్యువు అమృతము మనలోనే ఉంటాయి.
శ్లోll
అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్ఠితం
మృత్యురాపద్యతే మోహాత్ సత్యేనాపద్యతేzమృతం.
తే.గీll
నిత్యమమృ తము మృత్యువు నిశ్చితముగ
దేహమున నుండు దేహికి. దేహికుండు
మోహమునమృత్యువబ్బును.మోహి కాక
సత్యదర్శికి యమృతంబు సంభవించు.
భావము:-
అమృతము మృత్యువు అనే రెండూ దేహమునందే కలవు. మోహము కారణముగా మృత్యువును సత్య దర్శనము కారణముగా అమృతమును మానవులు పొంద గలరు.
జైహింద్. Print this post
2 comments:
బాగా చెప్పారు. ఈ శ్లోకం ఎందులోనిదండి?
పుటపర్తి సాయి బాబా మనకి ప్రత్యక్ష దైవము ఆస్వామిని నమ్మినవారికి కొంగు బంగారమె స్వామి చిత్రాన్ని ఉంచి మంచి పని చేసావ్ .స్వామి అభయ హస్తం మనకి కొండంత అండ .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.