గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జులై 2010, ఆదివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 100.


శ్లో:
బ్రహ్మ నిష్ఠో గృహస్థః స్యాత్; బ్రహ్మ జ్ఞాన పరాయణః
యద్యత్ కర్మ ప్రకుర్వంతి తద్బ్రహ్మణి సమర్పయేత్.
తే.గీ.
బ్రహ్మ నిష్ఠయు; జ్ఞానము; భక్తియు; మది
కలిగి యుండి; గృహస్థుఁడు కర్మములను
చేయ వలయును. అతఁడవి చేయు చుండి;
ఫలము కృష్ణార్పణము చేయ వలయు సతము. 
భావము:-
గృహస్థు బ్రహ్మ జ్ఞాన పరాయణుఁడై; బ్రహ్మ నిష్ఠుఁడై; ఈశ్వరార్పన బుద్ధితోనే సర్వ కర్మలను చేస్తూ ఉండ వలెను.



ఈ క్రింది శ్లోకము మేలిమి బంగారం మన సంస్కృతి 96 గా వ్రాయఁ బడినది. మరల నిచట పునరుక్తమైనది.

శ్లోll
భీతేభ్యశ్చాభయం దేయం. వ్యాధితేభ్యస్తథౌషధం.
దేయ విద్యార్థినాం విద్యా. దేయమన్నం క్షుథార్తినాం
తే.గీll
భీతునకు గొల్పుమభయంబు ప్రీతి తోడ.
వ్యాధికౌషధ మిడుమయ్య! భక్తి తోడ.
విద్య కోరిన గరపుమా హృద్యముగను;
ఆకలన్నట్టి వారికినన్న మిడుము.
భావము:-
భయము చెందిన వానికభయ దానము; రోగ పీడితులకు ఔషధ దానము; విద్యార్థులకు విద్యా దానము; ఆకొన్న వారికి అన్న దానము చేయుట ఉచితము.
జైహింద్.
Print this post

6 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఎంతో మంచి ఆణి ముత్యాలను అందిస్తున్న కవి పండితులు చిరంజీవి " చింతా వారు ధన్యలు " ఇప్పడికి [ 100 ]వంద మేలిమి బంగారాలు అంతేనా ? వేలకు వేలు అందించాలని ఆశీర్వ దిస్తూ అక్క

రవి చెప్పారు...

మరో చక్కని శ్లోకం, చిక్కటి అనువాదం. మీరు ఈ మధ్య కొత్త బంధాలను కూర్చట్లేదు!

సురేష్ బాబు చెప్పారు...

"శతకం(సెంచరి)" సాధించారు. ఇక సహస్రాలు కూడా సాధించాలని సరస్వతి దేవి వైభవం మీ చేతి ద్వారా పొంగిపోర్లుతునే ఉండాలని కోరుకొంటున్నాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాజేశ్వరక్కయ్యా! మీ ఆశూస్సులు తప్పక ఫలించబట్టే ఈమాత్రమైనా ఆ పర్రమాత్మ నాచేత చేయిస్తున్నాఁడు. ధన్యవాదాలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రవీ! తప్పక బంధాలలో అందరిమనసూ బంధిద్దాం మనం.
నీ అభిమానానికి సంతోషం. శుభాశీస్సులు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సురేష్ బబూ! ఆశీస్సులు.
నీ అభిమానానికి ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.