గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఆగస్టు 2019, శుక్రవారం

భ్రమక,అనఘా,వేదాశ్రీ,వెసనిడు,అజేయ,తాళియ,భర్తృజీవన,సాదరీ,ప్రతినా,గతిగూర్చు,గర్భ"-మెఱుంగుల"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.
భ్రమక,అనఘా,వేదాశ్రీ,వెసనిడు,అజేయ,తాళియ,భర్తృజీవన,సాదరీ,ప్రతినా,గతిగూర్చు,గర్భ"-మెఱుంగుల"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                           
"-మెఱుంగుల"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.న.ర.జ.య.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తాళి తంతు పెరిగె నంచు!త్వరగ కూర్చు సాధ్విరో?తగ పెంపౌ?భర్తృజీవమున్?                                                       మేలు కొమ్ము వడిగ భామ!మెఱుగు నెంచు!భావినిన్?మిగులౌ!సౌభాగ్యమారయన్?                                           చాలినంత!సుఖము గొమ్ము!సరిగ హైందవమ్మునన్?జగతిన్?కీర్తింపునొందుమా?                                                 బేలగాక!సరిని చేయు!పెరక బోకు?శాంతినిన్?బిగువౌ!బంధంబు!తాళియే!
***వృద్ధదంపతులలో!భర్త భార్య మెడయందలి పెరుగుటకు సిద్ధముగా
నున్న తాళియను చూచి"-తాళి వైశి ష్ట్యము,తెలుపు చున్న సందర్భమిది.
అర్ధములు:-
తాళితంతు=తాళికి గట్టు దారము,పెరిగెను=తెగెనని,కూర్చు=తాళిదారమును కూర్చుము,ఆరయన్=
తెలిసికొనగ,పెరక బోకు=లాగి వేయకు,

1.గర్భగత.భ్రమక"-వృత్తము.
బృహతీఛందము.ర.న.జ.గణములు.వృ.సం.379.
ప్రాసనియమము కలదు.
తాళి తంతు పెరిగె నంచు!
మేలు కొమ్ము!వడిగ భామ!
చాలినంత సుఖము కొమ్ము?
బేల. గాక !సరిని జేయు!
2.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.86.
ప్రాసనియమము కలదు.
త్వరగ కూర్చు సాధ్విరో?
మెఱుగు నెంచు భావిలో!
సరిగ హైందవమ్మునన్?
పెరక బోకు శాంతినిన్?
3.గర్భగత"-వేదాశ్రి"-వృత్తము.
బృహతీఛందము.స.త.ర.గణములు.వృ.సం.164.
ప్రాసనియమము కలదు.
తగ పెంపౌ?భర్తృ జీవమున్?
మిగులౌ?సౌభాగ్య మారయన్?
జగతిం!కీర్తింపు నొందుమా!
బిగువౌ!బంధంబు తాళియే?
4.గర్భగత"-వెసనిడు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.జ.న.ర.లగ.గణములు.యతి10,వయక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తాళి తంతు పెరిగె నంచు!త్వరగ కూర్చు!సాధ్విరో?
మేలుకొమ్ము వడిగ భామ!మెఱుగు నెంచు భావిలో?
చాలినంత!సుఖము కొమ్ము!సరిగ హైందవమ్మునన్?
బేల గాక!సరిని జేయు!పెరక బోకు శాంతినిన్?
5ెగర్భగత"-అజేయ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.య.ర.లగ.గణములు.యతి.09,వ యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
త్వరగ కూర్చు!సాధ్విరో?తగ పెంపౌ!భర్తృజీవమున్?
మెఱుగు నెంచు భావిలో?మిగులౌ!సౌభాగ్య మారయన్?
సరిగ హైందవమ్మునన్!జగతిం!కీర్తింపు నొందుమా?
పెరక బోకు శాంతినిన్?బిగువౌ!బంధంబు తాళియే?
6.గర్భగత"-తాళియ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.య.ర.య.జ.న.గల.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
త్వరగ కూర్చు!సాధ్విరో?తగ పెంపౌ!భర్తృ జీవమున్?తాళితంతు పెరిగెనంచు!                                                       మెఱుగు నెంచు భావిలో?మిగులౌ?సౌభాగ్య మారయన్?మేలుకొమ్ము వడిగభామ!                                               సరిగ హైంద వమ్మునన్?జగతిం!కీర్తింపు!నొందుమా?చాలినంత సుఖముకొమ్ము?                                                 పెరక బోకు!శాంతి నిన్?బిగువౌ!బంధంబు తాళియే?బేలగాక!సరియుజేయు!                                                         7.గర్భగత"-భర్తృ జీవ"-వృత్తము.
ధృతిఛందము.స.త.ర.ర.న.జ.గణములు.యతి.10,వయక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తగ పెంపౌ!భర్తృ జీవమున్?తాళి తంతు పెరిగె నంచు!
మిగులౌ!సౌభాగ్య మారయన్?మేలుకొమ్ము వడిగ భామ!
జగతిం!కీర్తింపు నొందుమా?చాలినంత సుఖము కొమ్ము!
బిగువౌ!బంధంబు తాళియే?బేలగాక సరియు జేయు!
8.గర్భగత"- సాదరీ"-వృత్తము.
ఉత్కృతి ఛందము.స.త.ర.ర.న.జ.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తగ పెంపౌ!భర్తృ జీవమున్?తాళి తంతు పెరిగెనంచు!త్వరగ కూర్చుసాధ్విరో?                                                         మిగులౌ!సౌభాగ్య మారయన్?మేలుకొమ్ము వడిగ భామ!మెఱుగు నెంచుభావిలో?                                               జగతిం!కీర్తింపు నొందుమా?చాలినంత సుఖము కొమ్ము!సరిగ హైందవమ్మునన్?                                               బిగువౌ!బంధంబు తాళియే?బేల గాక సరియు జేయు!పెరక బోకు!శాంతినిన్?                                                     9.గర్భగత"-ప్రతినా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.న.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
త్వరగ కూర్చు!సాధ్విరో?తాళి తంతు పెరిగె నంచు!
మెఱుగు నెంచు!భావిలో?మేలుకొమ్ము వడిగ భామ!
సరిగ హైందవమ్మునన్?చాలినంత!సుఖము కొమ్ము!
పెరక బోకు!శాంతినిన్?చేల గాక సరియు జేయు!
10గర్భగత"-గతిమార్చు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.న.భ.య.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
త్వరగ కూర్చు సాధ్విరో?తాళి తంతు పెరిగె నంచు!తగ పెంపౌ!భర్తృజీవమున్?                                                       మెఱుగు నెంచు భావిలో?మేలుకొమ్ము వడిగ!భామ!మిగులౌ!సౌభాగ్య మారయన్?                                             సరిగ హైందవమ్మునన్?చాలినంత!సుఖము కొమ్ము!జగతిం!కీర్తింపు నొందుమా?                                                 పెరక బోకు!శాంతినిన్?బేల గాక!సరియు జేయు!బిగువౌ!బంధంబుతాళియే?                                                         స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.