జైశ్రీరామ్.
భ్రమక,సమాశ్రీ,మత్తరజినీ,అయోనిజ,సుగంథి,మౌళిక,గర్భగత,కబురులాడు,శ్రీరమ్య,లోలలాడు,గర్భ"-హీన మానస"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-హీనమానస"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
లేనిపోని!కబురు లాడి!లీల లోల లాడ రాదు!లేవనెత్తి!ద్వేష భావమున్?
దాన ధర్మ మనుట మాని!తాళ జాల నీక జేసి!తావకుండ వంచు!పల్కుచున్?
కానరాని!పనుల జిక్కి!కాలయాపనంబు జేసి!కావరాక! గొప్ప లొప్పు చోన్?
మానహీన!బ్రతుకు లొప్పి!మౌళికాలు మంట బెట్ట!మా"-వరుండు రాడు గావగన్?
1.గర్భగత"-భ్రమక"-వృత్తము.
బృహతీఛందము.ర.న.జ.గణములు.వృ.సం.379.
ప్రాసనియమము కలదు.
లేని పోని కబురులాడి!
దాన ధర్మ మనుట మాని!
కానరాని!పనులు జిక్కి!
మాన హీన!బ్రతుకు లొప్పి!
2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
లీల లోల లాడ రాదు!
తాళ జాల నీక జేసి!
కాలయాపనంబు జేసి!
మౌళికాలు మంట బెట్ట!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
లేవనెత్తి!ద్వేష భావమున్?
తావకుండ వంచు పల్కుచున్?
కావ రాక గొప్ప లొప్పు చోన్?
మా"-వరుండు!రాడు!కావగన్?
4.గర్భగత"-అయోనిజ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.జ.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
లేని పోని!కబురు లాడి!లీల లోల లాడ రాదు!
దాన ధర్మ మనుట మాని!తాళ జాల నీక జేసి!
కానరాని!పనులు జిక్కి!కాల యాపనంబు జేసి!
మాన హీన బ్రతుకు లొప్పి!మౌళికాలు!మంట బెట్ట!
5.గర్భగత"-సుగంథి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు,వృ.సం.
లీల లోల లాడ రాదు!లేవ నెత్తి!ద్వేష భావమున్?
తాళ జాల నీక జేసి!తావకుండ వంచు పల్కుచున్?
కాల యాపనంబు జేసి!కావ రాక గొప్ప లొప్పు చోన్?
మౌళికాలు!మంట బెట్ట!మా"-వరుండు!రాడు కావగన్?
6.గర్భగత"-మౌళిక"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.న.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
లీల లోల లాడ రాదు!లేవనెత్తి!ద్వేష భావమున్?లేని పోని కబురు లాడి!
తాళ జాల నీక జేసి!తావకుండ వంచు బల్కుచున్?దాన ధర్మ మనుట మాని!
కాలయాపనంబు జేసి!కావరాక!గొప్ప లొప్పుచోన్?కానరాని పనుల జిక్కి!
మౌళికాలు మంటబెట్ట!మా"-వరుండు రాడు కావగన్?మాన హీన బ్రతుకులొప్పి!
7.గర్భగత"-గర్భగత"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.న.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
లేవ నెత్తి!ద్వేష భావమున్?లేని పోని కబురు లాడి!
తావకుండ వంచు బల్కుచున్?దాన ధర్మ మనుట మాని!
కావ రాక!గొప్ప లొప్పుచోన్?కానరాని పనుల జిక్కి!
మా"-వరుండు రాడు కావగన్?మానహీన బ్రతుకు లొప్పి!
8.గర్భగత"-కబురులాడు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.న.జ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
లేవ నెత్తి!ద్వేష భావమున్?లేనిపోని కబురు లాడి!లీల లోల లాడ రాదు!
తావకుండవంచు బల్కుచున్?దాన ధర్మ మనుట మాని!తాళజాలనీక జేసి!
కావరాక!గొప్ప లొప్పుచోన్?కానరాని పనులు జిక్కి!కాలయాపనంబు జేసి!
మా"-వరుండు రాడు కావగన్?మానహీన బ్రతుకు లొప్పి!మౌళి కాల మంట బెట్ట!
9,గర్భగత"-శ్రీరమ్య"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.న.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
లీల లోల లాడ రాదు!లేనిపోని కబురు లాడి!
తాళజాల నీక జేసి!దాన ధర్మ మనుట మాని!
కాలయాపనంబు జేసి!కానరాని పనుల జిక్కి?
మౌళికాల మంట బెట్ట!మాన హీన బ్రతుకు లొప్పి?
10,గర్భగత"లోలలాడు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.న.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
లీల లోల లాడ రాదు!లేని పోని కబురు లాడి!లేవనెత్తి!ద్వేష భావమున్?
తాళ జాల నీక జేసి!దాన ధర్మ మనుట మాని!తావకుండ వంచు బల్కుచున్!
కాలయాపనంబు జేసి!కానరాని పనుల జిక్కి!కావ రాక!గొప్ప లొప్పుచోన్?
మౌళికాల మంట బెట్ట!మాన హీన బ్రతుకు లొప్పి!మా"-వరుండు రాడు కావగన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.