గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, ఆగస్టు 2019, బుధవారం

జైశ్రీరామ్.
మృదుమానస,మూర్ఖత,విరహ,యశోమయ,భీమదా,నజానీ,నీలిమ,దయాంబుధి,నావనీ,చలాంచల,గర్భ"-మణిమేఖలా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-మణిమేఖలా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.జ.జ.య.జ.భ.య.లగ.గణములు.యతులు,9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఆటుపోటుల జీవమా!అహమస్మి!యనంబోకుమా!నరుగ వలె?మోక్షానికిన్!
మాటమీరక!మెల్గుమా!మహితాత్ముల సేవించుమా!మరుల సుర సమ్మోదతన్?
పాటు మంచికి తావవన్?పాహిమాం!సు దయాంబో నిథీ!పరము గను సౌహార్ద్రతన్?
గీటు దాటని నీతినిన్!గృహ శోభన!చేకూరగన్?గిరి వరుల కీర్తించుచున్!
1.గర్భగత"-మృదుమానస"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృ.సం.91.
ప్రాసనియమము కలదు.
ఆటు పోటుల జీవమా!
మాట మీరక!మెల్గుమా!
పాటు మంచికి!తావవన్?
గీటు దాటని!నీతినిన్?
2.గర్భగత"-మూర్ఖతా"-వృత్తము.
బృహతీఛందము.స.స.ర.గణములు.వృ.సం.156.
ప్రాసనియమము కలదు.
అహమస్మి'-యన బోకుమా?
మహితాత్ముల!సేవించుమా!
పాహిమాం"-దయాంబో నిథీ!
గృహ శోభన!చేకూరగన్?
3.గర్భగత"-విరహ"-వృత్తము.
బృహతీఛందము.న.ర.స.గణములు.వృ.సం.160,
ప్రాసనియమము కలదు.
అరుగవలె?మోక్షానికిన్?
మరుల సుర సమ్మోదతన్?!
పరము గను సౌ హార్ద్రతన్!
గిరి వరుల!కీర్తించుచున్?
4.గర్భగత"-యశోమయ"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.జ.జ.య.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఆటు పోటుల జీవమా!అహమస్మి!యనబోకుమా?
మాట మీరక మెల్గుమా!మహితాత్ముల సేవించుమా!
పాటు మంచికి తావవన్?పాహిమాం?దయాంబో నిథీ!
గీటు దాటని!నీతినిన్? గృహ శోభన చేకూరగన్?
5.గర్భగత"-భీమదా"-వృత్తము.
ధృతిఛందము.స.స.ర.న.స.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అహమస్మి!యనబోకుమా?యరుగ వలె?మోక్షానికిన్?
మహితాత్ముల!సేవించుమా!మరుల సుర సమ్మోదతన్!
పాహిమాం!దయాంబో!నిథీ! పరము గను సౌహార్ద్రతన్!.
గృహ శోభన చేకూరగన్?గిరివరుల కీర్తించుచున్?
6.గర్భగత"-నజానీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.ర.న.స.ర.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అహమస్మి!యనబోకుమా?యరుగవలె మోక్షానికిన్?ఆటుపోటుల జీవమా!
మహితాత్ముల సేవించుమా!మరుల సుర సమ్మోదతన్!మాట మీరక వెల్గుమా! పాహిమాం!దయాంబో !నిథీ!పరము గను!సౌహార్ధతన్!పాటు మంచికి తావవన్?
గృహ శోభన చేకురగన్?గిరి వరుల కీర్తించుచున్?గీటు దాటని నీతినిన్?
7.గర్భగత"-నీలిమ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.స.ర.ర.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అరుగవలె!మోక్షానికిన్?ఆటుపోటుల జీవమా!
మరుల సుర సమ్మోదతన్!మాటమీరక!వెల్గుమా!
పరము గను సౌహార్ధతన్?పాటు మంచికి తావవన్!
గిరివరుల కీర్తించుచున్?గీటు దాటని!నీతినిన్?
8.గర్భగత"-దయాంబుథి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.స.ర.ర.స.జ.జ.స.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అరుగవలె!మోక్షానికిన్?ఆటుపోటుల జీవమా!అహమస్మి యనబోకుమా?
మరుల సుర సమ్మో. దతన్!  మాట మీరక వెల్గుమా?  మహి  తాత్ముల సేవించుమా!
పరము గను!సౌహార్ధతన్! పాటు మంచికి తావవన్?పాహిమాం!దయాంబోనిథీ!
గిరివరుల కీర్తించుచున్?గీటు దాటని నీతినిన్?గృహ శోభన చేకూరగన్?
9.గర్భగత"-నావనీ"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.ర.స.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అహమస్మి!యనబోకుమా?ఆటు పోటుల జీవమా!
మహితాత్ముల!సేవించుమా!మాటమీరక వెల్గుమా!
పాహిమాం!దయాంబో నిథీ!పాటు మంచికి తావవన్?
గృహ శోభన చేకూరగన్?గీటుదాటని!నీతినిన్?
10,గర్భగత"-చలాంచల"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.ర.స.స.జ.న.య.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అహమస్మి!యనబోకుమా?ఆటు పోటుల జీవమా!అరుగవలె?మోక్షానికిన్?
మహితాత్ముల!సేవించుమా!మాట దాటక!వెల్గుమా?మరుల సుర సమ్మోదతన్?
పాహిమాం!దయాంబో నిథీ?పాటు మంచికి!తావవన్?పరము గను! సౌహార్ధతన్?
గృహ!శోభన!చేకూరగన్?గీటు దాటని నీతినిన్?గిరివరుల!కీర్తించుచున్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.