గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఆగస్టు 2019, శుక్రవారం

థారా,సమాశ్రీ,మత్తరజినీ,లోగొను,యతిర్నవసుగంథి,సుమేథ,శ్వాసినీ,గౌరవ,ఓపని,చిత్తచేష్ట,గర్భ"-చరితార్ధతా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
థారా,సమాశ్రీ,మత్తరజినీ,లోగొను,యతిర్నవసుగంథి,సుమేథ,శ్వాసినీ,గౌరవ,ఓపని,చిత్తచేష్ట,గర్భ"-చరితార్ధతా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                       
"-చరితార్ధతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చరితార్ధపు కీర్తి నందు!చాలినంత!మేథ పెంచు!జాతి గౌరవించు!తీరునన్!
సరి వారికి!తోడు నిల్చి!జాల మేల!మేలు కొమ్ము!స్వాతి ముత్య. మట్లు! ఖ్యాతినిన్!                                                                                
పరమాత్ముని మెచ్చి కొల్వు!పాలుగాకు!దుష్టచర్య!భ్రాతవౌచు!గావుమెల్లరిన్!
పురుషోత్తము డంచు బల్క!పూలు పూయు!పంట పండు!భూతి దీరు!లోక మందునన్!                                                                              
1.గర్భగత"-ధారా"-వృత్తము.
బృహతీఛందము.ర.స.జ.గణములు.వృ.సం.347.
ప్రాసనియమభు కలదు.వృ.సం.
చరితార్ధపు!కీర్తి నందు!
సరి వారికి !తోడు నిల్చి!
పరమాత్ముని!మెచ్చి కొల్వు!
పురుషోత్తము డంచు బల్క!
2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలధు.
చాలినంత!మేథ  పెంచు!.
జాల మేల!మేలు కొమ్ము!
పాలు గాకు!దుష్ట చర్య!
పూలు పూయు!పంట పండు!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు
జాతి గారవించు!తీరునన్!
స్వాతి ముత్య మట్లు!ఖ్యాతినిన్!
భ్రాత వౌచు!కావు మెల్లరిన్!
భూతి దీరు!లోకమంతయున్!
4.గర్భగత"-లోగొను"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.జ.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చరితార్ధపు!కీర్తి నందు!చాలి నంత!మేథ పెంచు!
సరి వారికి!తోడు నిల్చి!జాల మేల!మేలు కొమ్ము!
పరమాత్ముని!మెచ్చి కొల్వు!పాలు గాకు!దుష్ట చర్య!
పురుషోత్తము డంచు బల్క!పూలు పూయు!పంట పండు!
5.గర్భగత"-యతిర్నవ సుగంథి"-వృత్తము.
అత్యష్పీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.09,వయక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చాలినంత!మేథ పెంచు!జాతి గౌరవించు తీరునన్!
జాల మేల!కొమ్ము!స్వాతి ముత్య మట్లు!ఖ్యాతినిన్!
పాలు గాకు!దుష్ట చర్య!భ్రాత వౌచు!కావు మెల్లరిన్!
పూలు పూయు!పంట పండు!భూతిదీరు!లోకమంతయున్!
6.గర్భగత"-సుమేథ"-వోత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.జ.జ.జ.గల.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చాలినంత!మేథ పెంచు!జాతి గౌరవించు!తీరునన్!చరితార్ధపు!కీర్తినందు!
జాలమేల!మేలుకొమ్ము!స్వాతి ముత్యమట్లు!ఖ్యాతినిన్!సరివారికి!తోడు నిల్చి!                                                                                      
పాలుగాకు!దుష్టచర్య!భ్రాత వౌచు!కావు మెల్లరిన్!పరమాత్ముని మెచ్చి కొల్వు!
పూలు పూయు పంటపండు!భూతిదీరు!లోకమంతయున్!పురు షోత్తముడంచు బల్క!                                                                          
7.గర్భగత"-శ్వాసినీ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.స.స.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము. కలదు.వృ.సం.
జాతి గౌరవించు!తీరునన్!చరితార్ధపు!కీర్తి నందు!
స్వాతి ముత్య మట్లు!ఖ్యాతినిన్!సరివారికి!తోడు నిల్చి!
భ్రాత వౌచు!కావు మెల్లరిన్!పరమాత్ముని మెచ్చి కొల్వు!
భూతిదీరు!లోకమంతయున్!పురుషోత్తము డంచు బల్క!
8గర్భగత"-గౌరవ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.స.స.జ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియము కలదుువృ.సం.
జాతి గౌరవించు తీరునన్!చరితార్ధపు కీర్తి నందు!చాలినంత!మేథ పెంచు!
స్వాతి ముత్య మట్లు ఖ్యాతినిన్!సరివారికి తోడు నిల్చి!జాల మేల మేలు కొమ్ము!                                                                                        
భ్రాతవౌచు!కావు మెల్లరిన్!పరమాత్ముని మెచ్చి కొల్వు!పాలుగాకు!దుష్టచర్య!
భూతిదీరు!లోకమంతయున్!పురుషోత్తము డంచు బల్క!పూలు పూయు! పంట పండు!                                                                            
9.గర్భగత"-ఓపని"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.జ.జ.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చాలినంత!మేథ పెంచు!చరితార్ధపు కీర్తి నందు!
జాలమేల!మేలుకొమ్ము!సరివారికి తోడు నిల్చి!
పాలుగాకు!దుష్టచర్య!పరమాత్ముని మెచ్చి కొల్వు!
పూలు పూయు!పంట పండు!పురుషోత్తముడంచు బల్క!
10,గర్భగత"-చిత్తచేష్ట"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.జ.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చాలినంత!మేథ పెంచు!చరితార్ధపు!కీర్తినందు!జాతి గౌరవించు!తీరునన్!
జాల మేల!మేలు కొమ్ము!సరివారికి!తోడు నిల్చి!స్వాతి ముత్య మట్లుఖ్యాతినిన్!                                                                                  
పాలుగాకు!దుష్ట చర్య!పరమాత్మునిమెచ్చికొల్వుభ్రాతవౌచు!కావుమెల్లరిన్!
పూలు పూయు!పంటపండు!పురుషోత్తముడంచు బల్క!భూతిదీరు!లోక మంతయున్!                                                                          
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.