జైశ్రీరామ్.
నీలికంఠ,నరసా,నభయా,జపిత,అభయా,భూతిలేపన,ఉభయతారక,భయానక,విషగళ.సురత,గర్భ"-సన్నిభ"-వృత్తము.
రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
"-సన్నిభ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.త.స.జ.త.స.న.గగ.గణములు.యతులు.09,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తెలియ నైతి!నీవేషమ్!తిరిపె మేల?సాంభశివా!తిరిగెదేల?వసనాలన్!
వెలి విభూది పూతేలన్?వెరపు లేదె?కంఠ విషమ్!పెరగ వేల?పరులట్లన్!
తలచునట్టి భక్తాళిన్!తరియ జేతు లోకములన్!తరగ నట్టి సిరు లొప్పన్?
విలువ పెంచు సర్వేశా!విరుల పూజ సేతు నినున్!పెరల గొల్వ పరమాత్మా!
1.గర్భగత"-నీలికంఠ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.గగ.గణములు.వృ.సం.24.
ప్రాసనియమముకలదు.
తెలియ నైతి నీవేషమ్!
వెలి విభూది పూతేలన్?
తలచు నట్టి భక్తాళిన్!
విలువ పెంచు సర్వేశా!
2.గర్భగత"-నరసా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.స.గణములు.వృ.సం.216.
ప్రాసనియమముకలదు.
తిరిపె మేల?సాంభ శివా!
వెరపు లేదె?కంఠ విషమ్!
తరియ జేతు లోకములన్!
విరుల పూజ సేతు నినున్!
3.గర్భగత"-నభయా"-వృత్తము.
బృహతీఛందము.న.భ.య.గణములు.వృ.సం.120.
ప్రాసనియమముకలదు.
తిరిగెదేల?వసనాలన్!
పెరగ వేల?పరులట్లన్!
తరగ నట్టి సిరు లొప్పన్?
పెరల గొల్వ పరమాత్మా!
4.గర్భగత"-జపిత"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.త.స.జ.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తెలియ నైతి నీవేషమ్!తిరిపె మేల?సాంభ శివా!
వెలి విభూది పూతేలన్?వెరపు లేదె?కంఠ విషమ్!
తలచు నట్టి భక్తాళిన్!తరియ జేతు లోకములన్!
విలువ పెంచు సర్వేశా!విరుల పూజ సేతు నినున్!
5.గర్భగత"-అభయా"-వృత్తము.
ధృతిఛందము.న.ర.స.న.భ.య.గణములు.యతి.10,వ.యక్షరము
ప్రాసనియమముకలదు.వృ.సం.
తిరిపె మేల?సాంభ శివా!తిరిగెదేల?వసనాలన్!
వెరపు లేదె?కంఠ విషమ్!పెరగ వేల?పరులట్లన్!
తరియ జేతు లోకములన్!తరగ నట్టి సిరులొప్పన్?
విరుల పూజ సేతు నినున్!పెరల గొల్వ పరమాత్మా!
6.గర్భగత"-భూతి లేపన"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.స.న.భ.య.న.ర.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తిరిపె మేల?సాంభ శివా!తిరిగెదేల?వసనాలన్!తెలియ నైతి నీవేషమ్!
వెరపు లేదె?కంఠవిషమ్!పెరగ వేల?పరులట్లన్!వెలి విభూది పూతేలన్?
తరియ జేతు లోకములన్!తరగ నట్టి సిరులొప్పన్?తలచు నట్టి భక్తాళిన్!
విరుల పూజ సేతు నినున్!పెరల గొల్వ పరమాత్మా!విలువ పెంచు సర్వేశా!
7.గర్భగత"-ఉభయతారక"-వృత్తము.
అత్యష్టీఛందము.న.భ.య.న.ర.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తిరిగెదేల?వసనాలన్!తెలియ నైతి నీవేషమ్!
పెరగ వేల?పరులట్లన్!వెలి విభూది పూతేలన్?
తరగనట్టి సిరులొప్పన్?తలచునట్టి భక్తాళిన్!
పెరల గొల్వ పరమాత్మా!విలువ పెంచు సర్వేశా!
8.గర్భగత"-భయానక"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.య.న.ర.త.స.జ.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తిరిగెదేల?వసనాలన్!తెలియ నైతి నీవేషమ్!తిరిపె మేల?సాంభ శివా!
పెరగ వేల?పరులట్లన్!వెలి విభూది పూతేలన్?వెరపు లేదె?కంఠ విషమ్!
తరగనట్టి!సిరు లొప్పన్?తలచు నట్టి భక్తాళిన్!తరియ జేతు లోకములన్!
పెరల గొల్వ పరమాత్మా!విలువ పెంచు సర్వేశా!విరుల పూజసేతు నినున్!
9.గర్భగత"-విషగళ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.స.న.ర.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తిరిపె మేల?సాంభ శివా!తెలియ నైతి నీవేషమ్!
వెరపు లేదె?కంఠ విషమ్!వెలి విభూది పూతేలన్?
తరియ జేతు లోక ములన్?తలచు నట్టి భక్తాళిన్!
విరుల పూజ సేతు నినున్!విలువ పెంచు సర్వేశా!
10,గర్భగత"-సురత"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.స.న.ర.త.స.న.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తిరిపె మేల?సాంభ శివా!తెలియ నైతి నీవేషమ్!తిరిగెదేల?వసనాలన్!
వెరపు లేదె?కంఠ విషమ్!వెలి విభూది పూతేలన్?పెరగ వేల?పరులట్లన్!
తరియ జేతు లోక ములన్?తలచు నట్టి భక్తాళిన్!తరగనట్టి సిరులొప్పన్?
విరుల పూజ సేతు నినున్!విలువ పెంచు సర్వేశా!పెరల గొల్వ పరమాత్మా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.