జైశ్రీరామ్.
రసాంబరీ,రసనీ,అనఘా,నాశమెంచు,తెరగు,సుఖీభవ,ఛాందినీ,దేవధృక్కు,సాయపడు,సద్వాక్కు,గర్భ"-మాన్యతా"-వృత్తము.
రచన:- వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ.
"-మాన్యతా"-వృత్తము"-
ఉత్కృతిఛందము.ర.న.భ.న.భ.స.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తిండిలేని కడు బీదను!తెలిసి సాయపడ వలెన్!దివిజు లెంచు తీరునన్!
చెండనెంచు మది వీడుమ!చెలిమి భావి సుఖమవన్?శివ'మదేను!పాలకా!
పండు వెన్నె లలరించుచు!పలుకు నీతి చరుడవై!భవము నొంద రానటుల్!
గుండెలందు నిలువన్వలె!కుల మతాల విడుచుచున్!కువలయాన దైవమై!
1.గర్భగత"-రసాంబరీ"-వృత్తము.
బృహతీఛందము.ర.న.భ.గణములు.వృ.సం.433.
ప్రాసనియమముకలదు.
తిండిలేని కడు బీదను!
చెండ నెంచు మది వీడుమ!
పండు వెన్నె లలరించుచు!
గుండెలందు నిలువన్వలె!
2.గర్భగత"-రసనీ"-వృత్తము.
బృహతీఛందము.న.భ.స.గణములు.వృ.సం.248.
ప్రాసనియమముకలదు.
తెలిసి సాయ పడవలెన్!
చెలిమి భావి సుఖమవన్!
పలుకు నీతి చరుడవై!
కులమతాల విడుచుచున్!
3.గర్భగత "-అనఘా"-వృత్తము.
అనుష్టప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88.
ప్రాసనియమముకలదు.
దివిజులెంచు తీరునన్!
శివ'-మదేను!పాలకా!
భవము నొంద రానటుల్?
కువలయాన దైవమై!
4.గర్భగత"-నాశదూర"-వృత్తము.
ధృతిఛందము.ర.న.భ.న.భ.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృహసం.
తిండిలేని కడుబీదను!తెలిసి సాయపడవలెన్!
చెండనెంచు మది వీడుమ!చెలిమి భావి సుఖమవన్?
పండు వెన్నె లలరించుచు!పలుకు నీతి చరుడవై!
గుండెలందు నిలువన్వలె!కులమతాల విడుచుచున్!
5.గర్భగత"-తెరగు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.భ.స.న.ర.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తెలిసి సాయపడవలెన్!దివిజులెంచు తీరునన్?
చెలిమి భావి సుఖమవన్?శివ'-మదేను!పాలకా!
పలుకు నీతి చరుడవై!భవము నొంద రానటుల్?
కుల మతాల విడుచుచున్!కువలయాన దైవమై!
6.గర్భగత"-సుఖీభవ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.స.న.ర.య.జ.స.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తెలిసి సాయపడ వలెన్?దివిజు లెంచు తీరునన్!తిండిలేని కడు బీదను!
చెలిమి భావి సుఖమవన్?శివ'-మదేను!పాలకా!చెండనెంచు మది వీడుమ!
పలుకు నీతి చరుడవై!భవము నొంద రానటుల్?పండు వెన్నె లలరించుమ!
కుల మతాల విడుచుచున్!కువలయాన దైవమై!గుండెలందు నిలువన్వలె?
7.గర్భగత"-ఛాందినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.స.లల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
దివిజులెంచు తీరునన్?తిండిలేని కడుబీదను!
శివ'-మదేను?పాలకా!చెండనెంచు మది వీడుమ!
భవమునొంద రానటుల్?పండు వెన్నె లలరించుమ!
కువలయాన దైవమై!గుండెలందు నిలువన్వలె?
8.గర్భగత"-దేవధృక్కు"-వృత్తము.
ఉత్కృతిఛందము..ర.య.జ.న.న.స.న.లగ.గణములు.యతులు.09,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
దివిజులెంచు తీరునన్?తిండి లేని కడు బీదను!తెలిసి సాయపడ వలెన్?
శి'-మదేను?పాలకా!చెండనెంచు మది వీడుమ!చెలిమి భావి సుఖమవన్?
భవము నొంద రానటుల్?పండు వెన్నె లలరించుమ!పలుకు నీతి చరుడవై!
కువలయాన దైవమై!గుండెలందు నిలువన్వలె?కుల మతాల విడుచుచున్?
9.గర్భగత"-సాయపడు"-వృత్తము.
ధృతిఛందము.న.భ.స.ర.న.భ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తెలిసి సాయపడవలెన్?తిండిలేని కడు బీదను!
చెలిమి భావి సుఖమవన్?చెండనెంచు మది వీడుమ!
పలుకు నీతి చరుడవై!పండు వెన్నె లలరించుమ!
కుల మతాల విడుచుచున్?గుండెలందు నిలువన్వలె?
10.గర్భగత"-సద్వాక్కు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.స.ర.న.భ.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తెలిసి సాయపడవలెన్?తిండి లేని కడు బీదను!దివిజు లెంచు తీరునన్?
చెలిమి భావి సుఖ మవన్?చెండనెంచు మది వీడుమ!"-శివమదేను!పాలకా!
పలుకు నీతిచరుడవై!పండు వెన్నె లలరించుమ!భవము నొంద రానటుల్?
కుల మతాల విడుచుచున్!గుండెలందు నిలువన్వలె?కువలయాన దైవమై!
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.