జైశ్రీరామ్.
శ్రీవాణీ,వెలిఛాయ,మామక,తిరుమల,దివంకర,స్థిత ప్రజ్ఞా,భవితదిద్దు,ప్రకృత,మతి కుదురు,కవన సొంపు.సిరిదేవ,పురుష సింహా,మోహనా,గుణమతి,వనకేసరీ గర్భ"-సీసబింబ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
"-సీసబింబ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.య.న.ర.య.న.జ.న.గగ.గణములు.యతులు.8,15,22.ప్రాసనియమము కలదు.వృ.సం.
భువనాల నేలేటి భువనైక మోహనా!బుద్ధి స్థిమిత మేర్చు!పురుష సింహా!
దివ మీవు లోకేశ! దివి వర్గ దీపికా! దిద్దు భవిత కీర్తి! తిరుమ లేశా!
శివ మొప్ప దీవించు!జివి గూర్చు పావనా! సిద్థత కలిగించు!సిరుల దేవా!
కవి వౌచు కావ్యాల! కవనంపు సొంపులన్!కద్దు ప్రతిభ నీదు!కరివదాన్యా!
అర్ధములు:-దివము=పగలు,దిద్దు=సరిజేయుము,శివమొప్ప=శాంతి
కలుగు నట్ల,జివి=పట్టు,స్థైర్యము,కద్దు=కలదు.
1.గర్భగత"-శ్రీవాణీ"-వృత్తము.
ఉష్ణిక్ఛందము.స.య.ల.గణములు.వృ.సం.76,
ప్రాసనియమముకలదు.వృ.సం.
భువనాల నేలేటి
దివమీవు లోకేశ!
శివమొప్ప దీవించు!
కవివౌచు కావ్యాల!
2.గర్భగత"-వెలిఛాయ"-వృత్తము.
ఉష్ణిక్ఛందము.స.జ.గ.గణములు.వృ.సం.44.
ప్రాసనియమము కలదు .
భువనైక మోహనా!
దివి వర్గ దీపికా!
జివి గూర్చు పావనా!
కవనంపు సొంపులన్!
3.గర్భగత"-మామక"-వృత్తము.
ఉష్ణిక్ఛందము.భ.స.ల.గణములు.వృ.సం.95.
ప్రాసనియమము కలదు.
బుద్ధి స్థిమిత మేర్చు!
దిద్దు భవిత కీర్తి!
సిద్ధత కలిగించు!
కద్దు ప్రతిభ నీదు!
4.గర్భగత"-తిరుమల"-వృత్తము.
సుప్రతిష్టాఛందము.న.గగ.గణములు.వృ.సం.08.
ప్రాసనియమముకలదు.
పురుష సింహా!
తిరుమలేశా!
సిరుల దేవా!
కరివదాన్య!
5.గర్భగత"-దివంకర"-వృత్తము.
శక్వరీఛందము.స.య.న.ర.లగ.గణములు.యతి.08.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
భువనాల నేలేటి!భువనైక మోహనా!
దివమీవు లోకేశ!దివి వర్గ దీపికా!
శివ మొప్ప దీవించు!జివి గూర్చు పావనా!
కవి వౌచు కావ్యాల! కవనంపు సొంపులన్!
6.గర్భగత"-స్థిత ప్రజ్ఞా"-వృత్తము.
ప్రకృతిఛందము.స.య.న.ర.య.న.జ.గణములు.యతులు.08,15.
ప్రాసనియమముకలదు.వృ.సం.
భువనాల నేలేటి భువనైక మోహనా!బుద్ధి స్థిమిత మేర్చు!
దివమీవు లోకేశ!దివి వర్గ దీపికా! దిద్దు భవిత కీర్తి!
శివమొప్ప దీవించు!జివి గూర్చు పావనా!సిద్ధత గలిగించు!
కవి వౌచు కావ్యాల!కవనంపు సొంపులన్!కద్దు ప్రతిభ నీదు!
7.గర్భగత"-భవితదిద్దు"-వృత్తము.
శక్వరిఛందము.స.జ.త.న.గల.గణములు.యతి.08,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
భువనైక మోహనా!బుద్ధి స్థిమిత మేర్చు!
దివివర్గ దీపికా! దిద్దు భవిత కీర్తి!
జివి గూర్చు పావనా!సిద్ధత కలిగించు!
కవనంపు సొంపులన్!కద్దు ప్రతిభ నీదు!
8.గర్భగత"-ప్రకృత-వృత్తము.
అతిధృతి ఛందము.స.జ.త.న.భ.స.గ.గణములు.యతులు.08,15.
ప్రాసనియమము కలదు.వృ.సం.
భువనైక మోహనా!బుద్ధి స్థిమిత మేర్చు!పురుష సింహా!
దివివర్గ దీపికా!దిద్దు భవిత కీర్తి!తిరుమలేశా!
జివి గూర్చు పావనా!సిద్ధత కలిగించు!సిరుల దేవా!
కవనంపు సొంపులన్!కద్దు ప్రతిభ నీదు!కరివదాన్యా!
9.గర్భగత"-మతికుదురు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.జ.త.న.భ.జ.త.న.గగ.గణములు.యతులు.8,15,22.
ప్రాసనియమముకలదు.వృ.సం.
భువనైక మోహనా!బుద్ధి స్థిమితమేర్చు!భువనాల నేలేటి పురుష సింహా!
దివి వర్గ దీపికా!దిద్దు భవిత కీర్తి!దివమీవు లోకేశ!తిరుమలేశా!
జివిగూర్చు పావనా!సిద్ధత కలిగించు!శివమొప్ప దీవించు సిరుల దేవా!
కవనంపు సొంపులన్!కద్దు ప్రతిభ నీదు!కవివౌచు కావ్యాల కరి వదాన్యా!
10,గర్భగత"సిరిదేవ"-వృత్తము.
జగతీఛందము.భ.స.న.య.గణములు.యతి.08,.వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
బుద్ధి స్థిమిత మేర్చు!పురుష సింహా!
దిద్దు భవిత కీర్తి!తిరుమలేశా!
సిద్ధత గలిగించు!సిరుల దేవా!
కద్దు ప్రతిభ నీదు!కరివదాన్యా!
11మతికుదురుకవన సొంపు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.న.య.స.య.న.ర.లగ.గణములు.యతులు.8,13,20.ప్రాసనియు కలదు.వృ.సం.
!బుద్ధి స్థిమిత మేర్చు!పురుష సింహా!భువనాల నేలేటి!భువనైక మోహనా!
దిద్దు భవిత కీర్తి!తిరుమలేశా!దివమీవు లోకేశ!దివి వర్గ దీపికా!
సిద్ధత కలిగించు!సిరుల దేవా!శివ మొప్ప దీవించు!జివిగూర్చు పావనా!
కద్దు ప్రతిభ నీదు!కరివదాన్యా!కవివౌచు కావ్యాల!కవనంపు సొంపులన్!
12.గర్భగత"-పురుషసింహా"-వృత్తము.
అతిధృతిఛందము.న.భ.జ.త.స.జ.గ.గణములు.యతులు.6,13.
ప్రాసనియమముకలదు.వృ.సం.
పురుష సింహా!భువనాల నేలేటి!భువనైక మోహనా!
తిరుమలేశా!దివ మీవు లోకేశ! దివివర్గ దీపికా!
సిరుల దేవా!శివ మొప్ప దీవించు!జివి గూర్చు పావనా!
కరి వదాన్యా!కవివౌచు కావ్యాల!కవనంపు సొంపులన్!
13.గర్భగత"-మోహనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.జ.త.స.జ.త.న.గల.గణములు.యతులు.6,13,20.
ప్రాసనియమముకలదు.వృ.సం.
పురుష సింహా!భువనాల నేలేటి!భువనైక మోహనా!బుద్ధి స్థిమిత మేర్చు!
తిరుమలేశా!దివమీవు లోకేశ!దివి వర్గ దీపికా!దిద్దు భవిత కీర్తి!
సిరుల దేవా!శివ మొప్ప దీవించు!జివి గూర్చుపావనా!సిద్ధత కలిగించు!
కరివదాన్యా!కవివౌచు కావ్యాల!కవనంపు సొంపులన్!కద్దు ప్రతిభ నీదు!
14.గర్భగత"-గుణమతి"-వృత్తము.
జగతీఛందము.న.మ.న.జ.గణములు.యతి.6,.వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
పురుష సింహా!బుద్ధి స్థిమిత మేర్చు!
తిరుమలేశా!దిద్దు భవిత కీర్తి!
సిరుల దేవా! సిద్ధత కలిగించు!
కరివదాన్యా!కద్దు ప్రతిభ నీదు!
15.గర్భగత"-వన కేసరీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.న.జ.స.య.న.ర.లగ.గణములు.యతులు.
6,13,19,ప్రాసనియమముకలదు.వృ.సం.
పురుష సింహా!బుద్ధి స్థిమిత మేర్చు!భువనాల నేలేటి!భువనైక మోహనా!
తిరుమ లేశా!దిద్దు భవిత కీర్తి! దివమీవు లోకేశ! దివి వర్గ దీపికా!
సిరుల దేవా!సిద్ధత కలిగించు! శివమొప్ప దీవించు!జివి గూర్చు పావనా!
కరి వదాన్యా!కద్దు ప్రతిభ నీదు!కవి వౌచు కావ్యాల!కవనంపు సొంపులన్!
స్వస్తి.
v.మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.