గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జులై 2019, శుక్రవారం

అజ్ఞానినా,దశాశ్రి,,ప్రోక్త,,అనంగ,నింగినంటు,విమోచినీ,విధేయతా,నింగినీ,సుకీర్తి,వివేకినీ,గర్భ"-విద్యావినయ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
అజ్ఞానినా,దశాశ్రి,,ప్రోక్త,,అనంగ,నింగినంటు,విమోచినీ,విధేయతా,నింగినీ,సుకీర్తి,వివేకినీ,గర్భ"-విద్యావినయ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

విద్యావినయ వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.త.న.భ.భ.ర.య.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వినయ విధేయతల్గల్గు!విమల విద్యను నేర్వ!వివేక వంతమౌ!లోకమున్!
జననియు మెచ్చి కీర్తించు!సమత చేకురు నెంచ!జవాశ్వ వేగతన్వర్ధిలున్!
గొనకొని నీతినిం నిల్పు!కుమతి గాకుమి బాల!కువాచ్య దూరతన్!రాజివై!
వనములు రక్షితంబౌను!భము లెడంబగు నెల్ల!భవుండు మెచ్చ తేజంబునన్!
.అర్ధములు;-
వనములు=అడవులు,జల వనరులు,జననియు=కన్న తల్లియు,భారత మాతయు.కు వాచ్యములు=చెడు ప్రసంగములు.

1.గర్భగత"-అజ్ఞానినా"-వృత్తము.
బృహతీఛందము.న.జ.త.గణములు.వృ.సం.304.
ప్రాసనియమము కలదు.
వినయ విధేయతల్గల్గు!
జననియు మెచ్చి కీర్తించు!
గొనకొని నీతినిం నిల్పు!
వనములు రక్షితంబౌను!
2.గర్భగత"-దశాశ్రి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.భ.గల.గణములు.వృ.సం.184.
ప్రాసనియమము కలదు.
విమల విద్యను నేర్వ!
సమత చేకురు నెంచ!
కుమతి గాకుమి బాల!
భము లెడంబగు నెల్ల!
3.గర్భగత"-ప్రోక్త"-వృత్తము.
బృహతీఛందము.జ.ర.ర.గణములు.వృ.సం.10,
ప్రాసనియమము కలదు.
వివేకవంతమౌ!లోకమున్!
జవాశ్వ వేగతన్వర్ధిలున్!
కువాచ్య దూరతన్!రాజివై!
భవుండు మెచ్చ తేజంబునన్!
4.గర్భగత"-అనంగ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.త.న.భ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వినయ వివేకతల్గల్గు!విమల విద్యను నేర్వ!
జననియు మెచ్చి కీర్తించు!సమత చేకురు నెంచ!
గొనకొని నీతినిం నిల్పు!కుమతి గాకుమి బాల!
వనములు రక్షితం బౌను!భము లెడంబగు నెల్ల!
5.గర్భగత"-నింగినంటు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.భ.భ.ర.య.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
విమల విద్యను నేర్వ !వివేకవంతమౌ!లోకమున్!
సమత చేకురు నెంచ!జవాశ్వ వేగత న్వర్ధిలు!
కుమతి గాకుమి బాల!కు వాచ్య దూరతన్!రాజివై!
భము లెడంబగు నెల్ల!భవుండు మెచ్చ తేజంబునన్!
6.గర్భగత"-విమోచినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.భ.ర.య.జ.న.ర.గల.గణములు.యతులు.09,18,
ప్రాసనియమము కలదు.వృ.సం.
విమల విద్యను నేర్వ! వివేక వంతమౌ!లోకమున్!వినయ విధేయతల్గల్గు!
సమత చేకురు నెంచ!జవాశ్వ వేగత న్వర్ధిలున్! జననియు మెచ్చి కీర్తించు!
కుమతి గాకుమి బాల!కు వాచ్యదూరతన్!రాజివై!గొనకొని నీతినిం నిల్పు!
భము లెడంబగు నెల్ల!భవుండు మెచ్చ తేజంబునన్!వనములు రక్షితంబౌను!
7.గర్భగత"-విధేయతా"-వృత్తము.
ధృతిఛందము.జ.ర.ర.న.జ.త.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
వివేక వంతమౌ!లోకమున్!వినయ విధేయతల్గల్గు!
జవాశ్వ వేగత న్వర్ధిలున్! జననియు మెచ్చి కీర్తించు!
కు వాచ్య దూరతన్!రాజివై!గొనకొని నీతినిం నిల్పు!
భవుండు మెచ్చ తేజంబునన్!వనములు రక్షితంబౌను!
8.గర్భగత"-నింగినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.ర.న.జ.త.న.భ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వివేక వంతమౌ! లోకమున్!వినయ విధేయతల్గల్గు!విమల విద్యలు నేర్వ!
జవాశ్వ వేగత న్వర్ధిలున్!జననియు మెచ్చి కీర్తించు!సమత చేకురు నెంచ!
కువాచ్య దూరతన్!రాజివై!గొనకొని నీతినిం నిల్పు!కుమతి గాకుమి బాల!
భవుండు మెచ్చ తేజంబునన్!వనములు రక్షితంబౌను!భములెడంబగు నెల్ల!
9.గర్భగత"-సుకీర్తి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.భ.భ.న.ర.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమభు కలదు.విద్యల
విమల విద్యలు నేర్వ !వినయ విధేయతల్గల్గు!
సమత చేకురు నెంచ!జననియు మెచ్చి కీర్తించు!
కుమతి గాకుమి బాల!గొనకొని నీతినిం నిల్పు!
భము లెడంబగు నెల్ల!వనములు రక్షితంబౌను!
10,గర్భగత"-వివేకినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.భ.న.ర.భ.ర.య.లగ.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
విమల విద్యలు నేర్వ!వినయ విధేయతల్గల్గు!వివేకవంతమౌ!లోకమున్!
సమత చేకురు నెంచ!జననియు మెచ్చి కీర్తించు!జవాశ్వ వేగతన్వర్ధిలున్!
కు మతి గాకుమి బాల!గొనకొని నీతినింనిల్పు!కువాచ్య దూరతన్!రాజివై!
భము లెడంబగు నెల్ల!వనములు రక్షితంబౌను!భవుండు మెచ్చ తేజంబునన్!
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.