గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జులై 2019, ఆదివారం

ఎన్నంగల,శ్రీవాణీ.రాగాలాపనా,తమిజిక్కు,వచసా,సయశభా,గర్భ"-సీసోల్లాసినీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
ఎన్నంగల,శ్రీవాణీ.రాగాలాపనా,తమిజిక్కు,వచసా,సయశభా,గర్భ"-సీసోల్లాసినీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                       
 
"-సీసోల్లాసినీ"-వృత్తము."-
ఉత్కృతిఛందము.స.న.భ.జ.త.స.య.జ.గల.గణములు.యతులు.08,15.
ప్రాసనియమముకలదు.వృ.సం.
కనులుండి కనలేను!కమలాక్ష నీ రూపు!గళముండి గానంబు సేయ లేను!
వినులుండి వినలేను!విమలంపు నీప్రజ్ఞ!వెలలేని విస్థార స్వార్ధ చింత!
ధన మార్జనను దేలి! తమిజిక్కి వర్తింతు!తలపంగ దానంబు సేయ నైతి!
మనమందు నిలుమయ్య!మమకార బంధాన!మలి లేని మాంగళ్య ధామ  మిమ్మ!
                                                                                       
1.గర్భగత"-ఎన్నంగల"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.న.గల.గణములు.వృ.సం.186.
ప్రాసనియమముకలదు.
కనులుండి కనలేను!
వినులుండి వినలేను!
ధన మార్జనను దేలి!
మనమందు నిలు మయ్య!
2.గర్భగత"-శ్రీవాణీ"-వృత్తము.
ఉష్ణిక్ఛందము.స.య.ల.గణములు.వృసం.76,
ప్రాసనియమముకలదు.
కమలాక్ష!నీరూపు!
విమలంపు నీ ప్లజ్ఞ!
తమిజిక్కి వర్తింతు!
మమకార బంధాన!
3.గర్భగత"-రాగాలాప"-వృత్తము.
త్రిష్టుప్ఛందము.స.య.జ.గల.గణములు.యతి.05,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
గళముండి గానంబు సేయ లేను!
వెల లేని విస్థార స్వార్థ చింత!
తలపంగ దానంబు సేయనైతి!
మలి లేని మాంగళ్య ధామ మిమ్ము!
4.గర్భగత"-తమిజిక్కు"-వృత్తము.
ఆకృతిఛందము.స.య.జ.భ.జ.స.య.ల.గణములు.యతులు.5,12.
ప్రాసనియమముకలదు.వృ.సం.
గళముండి గానంబు సేయ లేను!కనులుండి కనలేను నీరూపు!
వెలలేని విస్థార స్వార్ధ చింత!వినులుండి వినలేను విమలంపు !
తలపంగ దానంబు జేయ నైతి!ధనమార్జనను జేసి తమిజిక్కి!
మలిలేని మాంగళ్య ధామ మిమ్మ!మనమందు నిలుమయ్య!మమకార!
5.గర్భగత"-వచసా"-వృత్తము.
అతిశక్వరీ ఛందము.స.న.భ.జ.త.గణములు.యతి09,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
కనులుండి కనలేను!కమలాక్ష నీ రూపు!
వినులుండి విన లేను విమలంపు నీ ప్రజ్ఞ!
ధనమార్జనను దేలి తమి జిక్కి వర్తింతు!
మనమందు నిలుమయ్య!మమకార బంధాన!
6.గర్భగత"-స యశభా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.య.స.భ.జ.స.న.ర.లగ.గణములు.యతులు.
5,12,20,ప్రాసనియమముకలదు.వృ.సం.
గళముండి గానంబు సేయ లేను!కనులుండి కనలేను!కమలాక్ష నీరూపు!
వెలలేని విస్థార స్వార్ధ చింత!వినులుండి వినలేను!విమలంపు నీ ప్రజ్ఞ!
తలపంగ దానంబు సేయ నైతి!ధనమార్జననుదేలి!తమిజిక్కి వర్తింతు!
మలిలేని మాంగళ్య ధామ మిమ్మ!మనమందు నిలుమయ్య!మమకార బంధాన!
స్వస్తి                                                                        
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సరస్వతీ పుత్రులు శ్రీ వల్లభవఝుల వారి ప్రతిభ శ్లాఘనీయము. పలురకముల చందస్సులను మాకందిస్తున్నందులకు కృతజ్ఞతలు శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.