గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జులై 2019, బుధవారం

మాయాశ్రయ,త్రినేత్ర,సురవరామ,భారజ,నియమా,వాజినీ,కేసరి.మోదపడి,జయహో,భాముల,విభుతా,చెనకు,క్షేమవాటి,గర్భ"-మంగళకర"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
మాయాశ్రయ,త్రినేత్ర,సురవరామ,భారజ,నియమా,వాజినీ,కేసరి.మోదపడి,జయహో,భాముల,విభుతా,చెనకు,క్షేమవాటి,గర్భ"-మంగళకర"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-మంగళకర"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.న.భ.న.స.జ.జ.ర.లగ.గణములు.యతులు.08,16.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మంగళ కరములన్!మనసు దవిలి చరింప!మామక పుణ్యమౌ!వసుంధరన్!
భంగము లలరినన్!పనులు ధర సమకూరు!భాముల నెంచకన్వరీయతన్!
సింగము బలె భువిన్!చెనకుమి చెడు నెడెంద!క్షేమము వాటిలన్శివాశ్రివై!
జంగముల సుథవై!జనని భళెయన ప్రీతి!సామత నొప్పుమా!చలాకునన్!
1.గర్భగత"-మాయాశ్రయ"-వృత్తము.
ఉష్ణిక్ఛందము.భ.న.గ.గణములు.వృ.సం.63.
ప్రాసనియమము కలదు.
మంగళ కరములన్!
భంగము లలరినన్?
సింగము బలె భువిన్!
జంగముల సుథవై!
2.గర్భగత"-త్రినేత్ర"-వృత్తము.
బృహతీఛందము.న.న.జ.గణములు.వృ.సం.384.
ప్రాస నియమము కలదు.
మనసు దవిలి చరింప!
పనులు ధర సమకూరు!
చెనకుమి చెడు నెడంద!
జనని భళెయన ప్రీతి!
3.గర్భగత"-సుర వరామ"-వృత్తము.
గాయిత్రీఛందము.భ.ర.గణములు.వృ.సం.23.
ప్రాసనియమము కలదు.
మామక పుణ్యమౌ?
భాముల నెంచకన్!
క్షేమము వాటిలన్!
సామత నొప్పుమా!
4.గర్భగత"-భారజ"-వృత్తము.
పంక్తిఛందము.భ.ర.జ.గ.గణములు.యతి.7,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మామక పుణ్యమౌ!వసుంధరన్!
భాముల నెంచకన్!వరీయతన్!
క్షేమము వాటిలం!శివాశ్రివై!
సామత నొప్పుమా!చలాకునన్!
5.గర్భగత"-నియమా"-వృత్తము.
అష్టీఛందము.భ.న.భ.న.స.ల.గణములు.యతి.8,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మంగళ కరములన్!మనసు దవిలి చరింప!
భంగము లలరినం!పనులు ధర సమకూరు!
సింగము బలె భువిన్!చెనకుమి చెడు నెడంద!
జంగముల సుథవై!జనని భళె యన ప్రీతి!
6.గర్భగత"-వాజినీ"-వృత్తము.
అతిశక్వరీఛందము.న.న.జ.భ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మనసు దవిలి చరింప!మామక పుణ్యమౌ!
పనులు ధర సమకూరు!భాముల నెంచకన్!
చెనకుమి చెడు నెడంద!క్షేమము వాటిలన్!
జనని భళెయన ప్రీతి!సామత నొప్పుమా!
7.గర్భగత"-కేసరి"-వృత్తము.
అతిధృతిఛందము.న.న.జ.భ.ర.జ.గ.గణములు.యతులు.10,16.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మనసు దవిలి చరింప మామక పుణ్యమౌ!వసుంధరన్!
పనులు ధర సమకూరు!భాముల నెంచకన్!వరీయతన్!
చెనకుమి చెడు నెడంద!క్షేమము వాటిలన్!శివాశ్రివై!
జనని భళె యన ప్రీతి!సామత నొప్పుమా!చలాకునన్!
8.గర్భగత"-మోదపడి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.జ.భ.ర.జ.త.న.లగ.గణములు.యతులు17,21.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మనసు దవిలి చరింప!మామక పుణ్యమౌ!వసుంధరన్!మంగళ కరములన్!
పనులు ధర సమకూరు!భాముల నెంచకన్వరీయతన్!భంగము లలరినన్?
చెనకుమి చెడు నెడంద!క్షేమము వాటిలన్!శివాశ్రివై!సింగము బలె భువిన్!
జనని భళె యన ప్రీతి!సామత నొప్పుమా!చలాకునన్!జంగముల సుథవై!
9.గర్భగత"-జయహో"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.జ.త.న.లగ.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మామక పుణ్యమౌ!వసుందరన్!మంగళ కరములన్!
భాముల నెంచకన్వరీయతన్!భంగము లలరినన్?
క్షేమము వాటిలన్!శివాశ్రివై!సింగము బలె భువిన్!
సామత నొప్పుమా!చలాకునన్!జంగముల సుథవై!
10.గర్భగత"-భాములు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.జ.త.న.జ.న.న.గల.గణములు.యతులు.11,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మామక పుణ్యమౌ!వసుంథరన్!మంగళ కరములన్!మనసు దవిలి చరింప!
భాముల నెంచకన్వరీయతన్!భంగము లలరినన్?పనులు థర సమకూరు!
క్షేమము వాటిలన్!శివాశ్రివై!సింగము బలె భువిన్!చెనకుమి చెడు నింద!
సామత నొప్పుమా చలాకునన్!జంగముల సుథవై!జనని భళెయన ప్రీతి!
11.గర్భగత"-విభుతృ"-వృత్తము.
అష్టీఛందము.న.న.జ.భ.న.గ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మనసు దవిలి చరింప!మంగళ కరములన్!
పనులు థర సమకూరు!భంగము లలరినన్?
చెనకుమి చెడు నింద!సింగము బలె భువిన్!
జనని భళె యన ప్రీతి!జంగముల సుథవై!
12.గర్భగత"-చెనకు"-వృత్తము.
ఆకృతిఛందము.న.న.జ.భ.న.భ.జ.గ.గణములు.యతులు.10,17.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మనసు దవిలి చరింప!మంగళ కరములన్!మామక పుణ్యమౌ!
పనులు థర సమకూరు!భంగము లలరినన్!భాముల నెంచకన్!
చెనకుమి!చెడునింద!సింగము బలె భువిన్!క్షేమము వాటిలన్!
జనని భళె యన ప్రీతి!జంగముల సుథవై!సామత నొప్పుమా!
13.గర్భగత"-క్షేమవాటి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.జ.భ.న.భ.జ.ర.లల.గణములు.యతులు.10,17.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మనసు దవిలి చరింప!మంగళ కరములన్!మామక పుణ్యమౌ!వసుంథరన్!
పనులు థర సమకూరు!భంగము లలరినన్?భాముల నెంచకన్వరీయతన్!
చెనకుమి!చెడు !నింద!సింగము బలె భువిన్!క్షేమము వాటిలన్!శివాశ్రివై!
జనని భళెయన ప్రీతి!జంగముల సుథవై! సామత నొప్పుమా!చలాకునన్!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.